Begin typing your search above and press return to search.
లవర్ తో మాల్దీవుల టూర్.. భార్య నుంచి దాచడానికి పాస్ పార్ట్ ట్యాంపరింగ్.. అరెస్ట్
By: Tupaki Desk | 12 July 2022 6:40 AM GMTచిలక్కొట్టుడు వ్యవహారాలు ఎప్పుడూ దాగవు. భార్యకు తెలియకుండా దాచిన యవ్వరాలన్నీ కరోనా టైంలో బయటపడి చాలా మంది చిక్కుల్లో పడ్డారు. సంసారాలు పాడు చేసుకున్నారు. ఇక భార్యకు తెలియకుండా మెయింటేన్ చేస్తున్న ఒక భర్త తాజాగా మాల్దీవులు టూర్ కు వెళ్లాడు. ఆ విషయాన్ని భార్య వద్ద దాచేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. మోసానికి పాల్పడి అరెస్ట్ కూడా అయ్యాడు.
ఒక వ్యక్తి తన భార్య నుండి ఇటీవలి వెళ్లిన విదేశీ పర్యటనను దాచడానికి ప్రయత్నించాడు. విదేశీ టూర్ కు కు సంబంధించి పేర్కొన్న తన పాస్‌పోర్ట్ లోని కొన్ని పేజీలను చింపివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పూణేకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి తన వివాహేతర సంబంధాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నాడు, అయితే పాస్‌పోర్ట్‌ను ట్యాంపరింగ్ చేశాడు. అయితే అది నేరమని అతనికి తెలియదు.
ఆ వ్యక్తి తన ప్రేయసిని కలవడానికి మాల్దీవులకు వెళ్లాడు. అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అతని పాస్‌పోర్ట్‌లోని కొన్ని పేజీలు కనిపించడం లేదని గమనించారు.
ప్రశ్నించగా తాను విదేశాల్లో ఉన్న తన ప్రియురాలిని చూసేందుకు వెళ్లానని.. అయితే పని నిమిత్తం ఇండియాలోనే వేరే ప్రాంతానికి వెళ్తున్నానని భార్యకు చెప్పానని.. అందుకే ఆమెకు డౌట్ రాకుండా పాస్ పోర్ట్ పేజీలను చింపినట్లు అధికారులకు అసలు విషయాన్ని వెల్లడించాడు.
ఆ వ్యక్తి సెలవులో ఉన్నప్పుడు అతని భార్య అతనికి ఫోన్ చేసింది. కానీ అతను సమాధానం ఇవ్వలేదు. తర్వాత విదేశాల్లో తిరిగే విషయం ఆమెకు తెలియదని భావించి పాస్‌పోర్ట్‌లోని పేజీలను తొలగించాడు. అయితే అది ట్యాంపరింగ్ అని అతడికి తెలియదు. దీంతో వ్యక్తిపై మోసం, ఫోర్జరీ కేసులు పెట్టి అరెస్టయ్యాడు.
చాలా పాపులర్ అయిన సోడా యాడ్ 'మెన్ విల్ బి మెన్' అని ఈ ఘటనను చూసి కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.