Begin typing your search above and press return to search.

మందులతో మగపిల్లలు పుడుతారా..?

By:  Tupaki Desk   |   2 Oct 2019 1:40 AM GMT
మందులతో మగపిల్లలు పుడుతారా..?
X
సైన్స్ ఆవిష్కరణలు పెరిగే కొద్దీ మనుషుల జీవితాలు సుఖమయం అవుతున్నాయి. ఇక అసాధ్యమనుకున్నవి సాధ్యం చేస్తున్నాం. అయితే ఎంత శాస్త్ర సాంకేతిక పెరిగినా కేవలం గర్భంలో మగబిడ్డనే పుట్టించాలనే పరిశోధన మాత్రం ముందుకు సాగడం లేదు..

అయితే తాజాగా మగబిడ్డ పుట్టాలంటే కొన్ని మందులు వాడాలంటూ కొందరు ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ మందులు వాడితే మగపిల్లలు పుడుతారని నమ్మిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ మందుల కోసం ఇప్పుడు మగ సంతానం లేని వారు లక్షలు ఖర్చు చేస్తున్నారట..

తాజాగా ఈ విషయంపై వైద్యులు - నిపుణులు స్పందించారు. మందులతో ఆడ, మగ బిడ్డను డిసైడ్ చేయలేమని స్పష్టం చేస్తున్నారు. గర్భం దాల్చడం వరకే మన చేతుల్లో ఉంటుందని.. ఆడబిడ్డ, మగబిడ్డ అనేది తేల్చడం ఎవరి చేతుల్లో ఉండదని స్పష్టం చేస్తున్నారు..

సైన్స్ ప్రకారం.. గర్భం దాల్చగానే మహిళల అండంలో ఉండే ‘ఎక్స్’, ‘ఎక్స్’ క్రోమోజోములు, పురుషుల వీర్యంలో ఉండే ‘ఎక్స్’ - ‘వై’ క్రోమోజోముల కలయిక జరుగుతుంది. మహిళ ఎక్స్ - పురుషుడి వై కలిస్తే మగ బిడ్డ - మహిళ ఎక్స్ - పురుషుడి ఎక్స్ కలిస్తే ఆడబిడ్డ పుడుతుంది. దీన్ని ప్రభావితం చేయడం మన వైద్యశాస్త్రం చేతుల్లో కూడా లేదు. అదృష్టం పైనే ఆధారపడుతుంది.

అయితే పురుషులకు వై క్రోమోజోములు పెంచే మందులు ఉన్నాయని కొంత మంది ప్రచారం మొదలు పెట్టారు. దీనికోసం ఇప్పుడు భారీగా ఖర్చు చేస్తున్నారు. మనిషిలోని క్రోమోజోములను పెంచే మందులు ఏవీ లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ మనిషి కణంలోనూ ఎక్స్ - వై క్రోమో జోములు ఉంటాయని చెబుతున్నారు.వాటిని పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.