Begin typing your search above and press return to search.
మగ సెక్స్ వర్కర్లకు అడ్డా ఆ జిల్లా!
By: Tupaki Desk | 21 Oct 2019 1:30 AM GMTభారతీయ సమాజం తీరు నానాటికీ మారిపోతోంది. పాశ్చాత్య ధోరణులు ఇక్కడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా లైంగిక ధోరణులు, లైంగిక స్వేచ్ఛ, లైంగిక వ్యాపారం ముందెన్నడూ లేనట్లుగా మారిపోతోంది. స్వలింగ సంపర్కులు, వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే తప్పేంటనే మహిళలు పెరుగుతున్నారు. సెక్స్ కొనుక్కోవడమూ ఎక్కువవుతోంది. ఈ మార్పులకు సంబంధించి కేరళ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చేపట్టిన ఓ సర్వేలో ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో మహిళా సెక్స్ వర్కర్లకు దాదాపు సమాన సంఖ్యలో పురుష సెక్స్ వర్కర్లూ ఉన్నట్లు లెక్క తేల్చారు.
కేరళలో ఏటా సెక్స్ వర్కర్ల సంఖ్య పెరుగుతోందట. వీరిలో మగవారు కూడా అధిక సంఖ్యలో ఉంటున్నారని గుర్తించారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చేసిన సర్వే ప్రకారం ఇప్పుడు కేరళలో 17వేల మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉండగా.. 13,331 మంది మగవారు ఉన్నారు. అంతేకాదు ఆ రాష్ట్రానికి వలస వెళుతున్న సెక్స్ వర్కర్ల సంఖ్య కూడా పెరుగుతోందని సర్వే వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వస్తున్న వారి నుంచే ఎక్కువగా సెక్స్ వర్కర్లు తయారువుతున్నారని ఈ సర్వే వెల్లడించింది.
సెక్స్ వర్కర్లలో ఎక్కువగా 36-46 మధ్య వయస్కులున్నట్లు గుర్తించారు. నగరాల్లోని హోటళ్లు, ఫ్లాట్లలో ఉంటూ ఆ పనిని చేస్తున్నారట. ఈ వృత్తిలో కొనసాగి ఆ తరువాత వయసు మీద పడ్డ వారు ఏజెంట్లుగా మారుతున్నారని ఆ సర్వే పేర్కొంది. బెంగాల్, బీహార్, ఒడిశా నుంచి వచ్చిన మహిళా సెక్స్ వర్కర్లు క్రమంగా తమ పరిచయస్థులు, బంధువులనూ ఈ వృత్తిలో దించుతున్నారని చెబుతున్నారు. బెంగాల్ నుంచి చాలా మంది సెక్స్ వర్కర్లు ఏజెంట్ల ద్వారా కేరళకు వస్తున్నారని పేర్కొన్నారు. మగ సెక్స్ వర్కర్లు ఎక్కువగా కేరళలోని కోళికోడ్ జిల్లా నుంచి వస్తున్నారని సర్వే తెలిపింది. ఇక ఈ సెక్స్ వర్కర్లలో 10వేల మందికి పైగా డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని.. వారిలో దాదాపు 15మందికి హెచ్ఐవీ కూడా ఉందని సర్వే వివరించింది.