Begin typing your search above and press return to search.
నన్ను రేప్ చేశారు.. లెఫ్ట్ నేత ఆవేదన!
By: Tupaki Desk | 16 Sep 2017 4:44 AM GMTఅత్యాచారాలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. భద్రత ఎంత కట్టుదిట్టం చేసినా.. ఎక్కడో ఒక చోట ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. `ఓ దుండగుడు కత్తితో బెదిరించి నన్ను రేప్ చేశాడు` అని కొన్ని సందర్భాల్లో కొంతమంది యువతులు ధైర్యంగా ముందు కొచ్చి పోలీసులకు చెబుతుంటారు! అయితే వీటినే ఒక పురుషుడు చెబితే? అందులోనూ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న రాజకీయ నాయకుడిపైనే ఇటువంటి దుశ్చర్యకు దుండగులు పాల్పడితే? వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ! కానీ ఇటువంటి విచిత్రకర సంఘటన స్వీడన్‌లో కలకలం సృష్టిస్తోంది!
విదేశాల్లో జరిగే సంఘటనలు కొన్ని ఆశ్చర్యంగానూ మరికొన్ని వింతగానూ ఉంటాయి. స్వీడన్ లో ప్రజాస్వామ్య హక్కుల కోసం లెఫ్ట్ పార్టీకి చెందిన నేత పాట్రిక్ లిల్జేగ్లోడ్ పోరాడుతున్నారు. ఆయన తన ఫేస్ బుక్ పేజీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అత్యాచారానికి గురయ్యానంటూ పోస్ట్ చేశారు! ఓ దుండగుడు తనను కత్తితో బెదిరించి రేప్ చేశాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కౌన్సిల్ మీటింగ్ లోనూ ఈ ఘటనపై సభ్యులు గళమెత్తారు. పోలీసులు - ఫోరెన్సిక్ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు.
'తొలుత ఈ విషయాన్ని దాచిపెట్టాలని భావించా. కానీ ఈ దారుణాన్ని బయటకు చెప్పాల్సిన బాధ్యత కూడా నాపై ఉందని భావించా. ఇది కచ్చితంగా రాజకీయ దురుద్దేశంతో జరిగిన దాడే. నాపై కత్తి పెట్టి - నన్ను దారుణంగా రేప్ చేశారు. కేవలం నేను లెఫ్ట్ వింగ్ కు చెందిన నాయకుడిని కాబట్టే ఇలా చేశారు. చివరకు నన్ను ఓ దేశద్రోహిలా చిత్రీకరించేలా ప్రయత్నిస్తున్నారు' అని పాట్రిక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆలోచించే కొద్ది మంది పౌరులకు వాటి విలువల గురించి తెలపాల్సిన అవసరం ఉందన్నారు.