Begin typing your search above and press return to search.
రేవంత్ - మల్లారెడ్డిలు తిట్టేసుకుంటే.. వారికంత శిక్ష పడుతుందా?
By: Tupaki Desk | 26 Aug 2021 3:10 AM GMTరెండు మదపటేనుగులు ఢీ కొంటే ఏమవుతుంది? ఇద్దరు శక్తివంతులు ముఖాముఖి పోరుకు దిగితే ఎలా ఉంటుంది? తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది. ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన రెండు రోజుల దీక్ష ముగింపు వేళ.. మంత్రి మల్లారెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలకు జెట్ స్పీడ్ తో రియాక్షన్ వచ్చేసింది. ఇప్పటివరకు ఎప్పుడు వినని తిట్లతో మండిపడ్డారు మల్లారెడ్డి. అంతేనా.. భారీ సవాలు విసిరారు. సాధారణంగా రోడ్ల మీద ఇష్టారాజ్యంగా పోట్లాడుకునే వేళ సామాన్యుల నోటి నుంచి వచ్చే మాటలకు ఏ మాత్రం తగ్గని రీతిలో మంత్రి మల్లారెడ్డి మాటలు ఉన్నాయి.
ఇంతటి తీవ్రమైన బూతుల్ని ఈ మధ్య కాలంలో మరే నేత కూడా వాడలేదేమో? రేవంత్ పై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు.. సవాళ్లకు రేవంత్ రెడ్డి అస్సలు రియాక్టు కాలేదు. అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ వర్గాల వారు రంగంలోకి దిగారు. దళితుల కోసం రేవంత్ కోట్లాడుతుంటే.. తమ నాయకుడ్ని ఇష్టారాజ్యంగా మాటలు అనేస్తావా? నీవెంత? నీ కత ఎంతన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
రేవంత్ ను ఇష్టారాజ్యంగా తిట్టేసిన మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతల రియాక్షన్ తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని గంటల వ్యవధిలోనే చూపించేశారు. మంత్రి మల్లారెడ్డి దిష్టి బొమ్మకు చెప్పుదెబ్బలు కొడుతూ.. రేవంత్ ను ఏ స్థాయిలో తిట్టారో.. దాదాపుగా అలాంటి మాటల్నే ఆయన్ను ఉద్దేశించి తిట్టటం మొదలు పెట్టారు. ఇక్కడితో అయిపోలేదు. మంత్రి మల్లారెడ్డి తాను అన్న మాటలకు క్షమాపణలు చెప్పాలంటూ కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్న రేవంత్ ను అంత దారుణంగా తిడతారా? అంటూ మండిపడుతున్నారు. బోయినపల్లిలోని మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రేవంత్ పై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ స్థాయి అధికారులతో భద్రతను ఏర్పాటు చేయటం చూస్తే.. పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా చూసినప్పుడు తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్.. ఆయన మాటలకు చెలరేగిపోయి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసిన మల్లారెడ్డిలు ఎలా ఉన్నారో కానీ.. వారి పుణ్యమా అని దాదాపు వంద మంది వరకు పోలీసులకు మాత్రం నిద్రకు దూరమై.. రాత్రిళ్లు దోమలు కుట్టించుకుంటే గస్తీ కాయాల్సిన పరిస్థితి. ఇద్దరు నేతలు తిట్టేసుకోవటం.. దానికి పోలీసులకు పనిష్మెంట్ పడటం గమనార్హం.