Begin typing your search above and press return to search.
మల్లారెడ్డికి క్షీరాభిషేకం...నెటిజన్ల సెటైర్లు!
By: Tupaki Desk | 10 Sep 2018 7:31 AM GMTసాధారణంగా దేవతా విగ్రహాలకు క్షీరాభిషేకం చేయడం పరిపాటి. ఇక కొంతమంది తమ అభిమాన హీరోల కటౌట్లకు కూడా క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే, దైవంతో సమానంగా కొంతమంది వ్యక్తులను పూజించడంలో తప్పు లేదు. అయితే, ఆ వ్యక్తిపూజ - క్షీరాభిషేకాలు చేయడం వంటివి ఆ వ్యక్తి ఔన్నత్యం, గొప్పదనంపై ఆధారపడి ఉంటాయి. దేశం కోసం తన జీవితాన్ని ధారబోసిన అబ్దుల్ కలాం వంటి మహోన్నత వ్యక్తులకు క్షీరాభిషేకాలు చేయడం....వారిని ఆరాధించడం తప్పుకాదు. అయితే, తాజాగా ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు క్షీరాభిషేకం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత - మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. తన మోటివేషనల్ స్పీచ్ లతో తన విద్యాసంస్థలలోని విద్యార్థులను ఆయన ఆకట్టుకుంటుంటారు. మారథాన్ లు, 5కే రన్ లలో ఆయన యాక్టివ్ గా పాల్గొంటూ మీడియా వార్తల్లో నిలుస్తుంటారు. ఇలా రకరకాల సందర్భాల్లో మల్లా రెడ్డి.... మీడియా దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మల్లారెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు క్షీరాభిషేకం నిర్వహించారు. మల్లారెడ్డిని ఆయన అభిమానులు పాలతో అభిషేకిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో ఆ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. తమ అభిమాన నేతకు ఆ అభిమానుల క్షీరాభిషేకం చేయడంలో తప్పేమీ లేదని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మల్లారెడ్డి దేవుడు కాదని, అటువంటిది ఆయనకు క్షీరాభిషేకం చేయడం ఏమిటని, మరీ ఓవర్ చేస్తున్నారని మరికొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.