Begin typing your search above and press return to search.

అట్లుంటది మల్లారెడ్డి లెక్క.. రీల్ డీజే టిల్లుతో స్టెప్పులేశాడు

By:  Tupaki Desk   |   12 Jan 2023 5:30 AM GMT
అట్లుంటది మల్లారెడ్డి లెక్క.. రీల్ డీజే టిల్లుతో స్టెప్పులేశాడు
X
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి లెక్కే వేరుంటుంది. తోపు రాజకీయ నేతగా ఆయనకున్నపేరును పెద్దగా పట్టించుకోకుండా యూత్ కు ఇట్టే కనెక్టు అయ్యేలా ఆయన మాటలు.. చేతలు ఉంటాయి. తెలుగురాష్ట్రాలకు చెందిన మరే రాజకీయ నేత వ్యవహరించని రీతిలో ఆయన చేతలు ఉంటాయి.

ఆరుపదుల ప్లస్ వయసులోనూ పాతికేళ్ల కుర్రాడికి ఉండే ఉత్సాహం ఆయన సొంతం. పదుల సంఖ్యలో కళాశాలలకు అధినేత అయినప్పటికీ.. ఆ పెద్దరికపు పోకడల్ని పక్కన పెట్టేసి.. పిల్లల్లో కలిసిపోయే ఆయన తీరు ఎప్పుడూ వార్తాంశంగా ఉంటూనే ఉంటుంది.

తాజాగా ఆయన విద్యా సంస్థలకు సంబంధించిన క్యాంపస్ లో భారీ ఎత్తున సంక్రాంతి కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ సంబరాలకు వేలాదిగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డీజే టిల్లు ఫేం సిద్ధూ హాజరయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. కార్యక్రమంలో భాగంగా డీజే టిల్లు టైటిల్ సాంగ్ కు హీరో సిద్ధూతో కలిసి రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఉత్సాహంగా స్టెప్పులు వేయటం విపరీతంగా ఆకర్షించింది.

సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో విద్యా సంస్థల ఛైర్మన్ కమ్ రాష్ట్ర కార్మిక మంత్రిగా వ్యవహరిస్తున్న మల్లారెడ్డి ఉత్సాహంగా హీరో సిద్ధూతో కలిసి స్టెప్పులు వేయటంతో కాలేజీ విద్యార్థుల పట్టలేనంత ఆనందానికి గురయ్యారు.

మంత్రి మల్లారెడ్డి స్టెప్పులకు కేరింతలు కొట్టిన విద్యార్థులతో అక్కడి ప్రాంగణమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఇదంతా చూసినోళ్లు అట్లుంటది మంత్రి మల్లారెడ్డి లెక్క అనుకోకుండా ఉండలేని పరిస్థితి.

ఇక.. ఈ సంబరాలకు మరో రికార్డు కూడా తోడైంది. ఒకే ప్రాంగణంలో 25 వేల మంది విద్యార్థులతో నిర్వహించిన కైట్ ఫెస్టివల్.. ముగ్గుల పోటీలకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. మల్లారెడ్డినా మజాకానా?



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.