Begin typing your search above and press return to search.
బాబుకు రుణపడి ఉంటానంటున్న జంప్ జిలానీ
By: Tupaki Desk | 1 Jun 2016 10:55 AM GMTఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ అధినేతను దేవుడు అంటారు. కానీ అవతలి పార్టీలోకి వెళ్లగానే ఆ పార్టీ అధినాయకుడు దేవుడైపోతాడు. ఇన్నాళ్లూ దేవుడని పొగిడిన నేతను బూతులు తిట్టేస్తుంటారు. ఐతే టీఆర్ ఎస్ పార్టీలోకి జంప్ చేసిన తెలుగుదేశం ఎంపీ మల్లారెడ్డి మాత్రం పార్టీ మారినా తన లాయల్టీని మాత్రం మరిచిపోలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికీ తనకు దేవుడి లాంటి వాడే అంటున్నారాయన.
తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన చంద్రబాబును తానెప్పటికీ మరిచిపోలేనని అన్నారు. 2014 ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ కేటాయించినందుకు తాను రుణపడి ఉంటానన్నారు. చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ అని.. ఆయన విజన్ తనకెంతో నచ్చుతుందని కూడా అన్నారు మల్లారెడ్డి. టీఆర్ ఎస్ లో చేరిన అనంతరం ఆయనీ వ్యాఖ్యలు చేయడం విశేషం.
అలాగని కేసీఆర్ ను కూడా మల్లారెడ్డి వదిలిపెట్టలేదు. బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న కేసీఆర్ విధానాలకు తాను ఆకర్షితుడినైనట్లు ఆయన చెప్పారు. కేుసీఆర్ గొప్ప లీడర్ అని ఆయన కితాబిచ్చారు. మొత్తానికి తెలుగుదేశంను వదిలేసిన మిగతా నేతల్లాగా చంద్రబాబు తిట్టిపోయకుండా మర్యాదపూర్వకరంగా మాట్లాడి మార్కులు కొట్టేశారు మల్లారెడ్డి. ఐతే వస్తూ వస్తూ చంద్రబాబును పొగిడి వస్తున్న ఆయనకు టీర్ ఎస్ లో మున్ముందు ఆయనకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో చూడాలి.