Begin typing your search above and press return to search.
మంత్రులందరికీ చాంబర్లు..మల్లారెడ్డి షాక్
By: Tupaki Desk | 20 Feb 2019 4:42 PM GMTతెలంగాణ కేబినెట్ ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎట్టకేలకు విస్తరించిన సంగతి తెలిసిందే. మంగళవారం మాఘ శుద్ధ పౌర్ణమి ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ పదిమందితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. తాజా విస్తరణతో రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య 12కు చేరింది. ఈ రోజు సెక్రటేరియట్ లో మంత్రులకు ఛాంబర్ లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి చామకూర మల్లారెడ్డికి మినహా మిగతా వారికి ఛాంబర్ లు కేటాయించింది!
మంత్రివర్గంలో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణం స్వీకరించగా.. తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ - జీ జగదీశ్ రెడ్డి - ఈటల రాజేందర్ - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి - కొప్పుల ఈశ్వర్ - ఎర్రబెల్లి దయాకర్ రావు - వీ శ్రీనివాస్ గౌడ్ - వేముల ప్రశాంత్ రెడ్డి - సీహెచ్ మల్లారెడ్డి వరుసగా ప్రమాణం చేశారు. జగదీశ్ రెడ్డి - ఈటల రాజేందర్ పవిత్ర హృదయంతో - మిగిలిన సభ్యులు దైవ సాక్షిగా ప్రమాణంచేశారు. ప్రమాణం అనంతరం కొత్త మంత్రులు గవర్నర్ నరసింహన్ - సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమం అనంతరం గవర్నర్ నరసింహన్ - సీఎం కేసీఆర్ మంత్రులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. కొత్తగా చేరిన మంత్రులకు సీఎం శాఖలు కేటాయించారు. సీఎం ఆదేశాల మేరకు కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీచేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ క్యాబినెట్ ను మంగళవారం విస్తరించారు. అయితే, మల్లారెడ్డికి మాత్రం చాంబర్ కేటాయించకపోవడం ఆసక్తికరంగా మారింది.
ఇదిలాఉండగా - రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం గురువారం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతిభవన్ లో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలియజేస్తారు. ఈ మేరకు మంత్రులకు సాధారణ పరిపాలనశాఖ సమాచారం అందించింది. సమావేశానికి ఎజెండాను కూడా జీఏడీ రూపొందించనుంది.