Begin typing your search above and press return to search.
సామినేని-సారథి మధ్యలో మల్లాది…!
By: Tupaki Desk | 21 May 2021 3:29 AM GMTఏపీలో మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గరపడుతుంది. జగన్ అధికారంలోకి రాగానే ఒకేసారి 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనివారికి జగన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మళ్ళీ రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తానని, అప్పుడు పలువురుకి అవకాశం కల్పిస్తానని చెప్పారు. అలాగే పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తానని అన్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది. అంటే మరో ఆరు నెలల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అప్పుడు ఛాన్స్ కొట్టేయాలని చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు చూస్తున్నారు.
ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలో ఉన్న సీనియర్లు సైతం అవకాశం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు జగన్ కేబినెట్‌లో ఉన్నారు. ఇక వీరిలో జగన్ ఎవరిని పక్కనబెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తారని ఆసక్తికరంగా మారింది. కొడాలి నాని ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ + సామాజిక సమీకరణల పరంగా టాప్ గేర్‌లో ఉన్నారు. పైగా చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలను తిట్టాలంటే ఆయన డైలాగులే బాగా పేలుతున్నాయి. ఆయన్ను తప్పించకపోవచ్చనే అంటున్నారు.
ఇక కొత్తగా కేబినెట్ బెర్త్ ఆశిస్తోన్న వారిలో సీనియర్ ఎమ్మెల్యేలు పార్థసారథి, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణులు జగన్ కేబినెట్‌లో ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్నారు. అసలు మొదటి విడతలోనే పదవి దక్కించుకోవాలని సారథి చూశారు. కానీ సామాజికవర్గాల సమీకరణల్లో భాగంగా ఆయనకు పదవి దక్కలేదు. సారథి సామాజిక వర్గం నుంచి మరో ఫైర్ బ్రాండ్ అనిల్ మంత్రిగా ఉన్నారు. అనిల్‌ను తప్పిస్తేనే ఇక్కడ సారథికి ఛాన్స్ ఉంటుంది. దీంతో సారథిలో అనిల్ టెన్షన్ ఎక్కువుగా ఉంది. అటు మల్లాది విష్ణు, సామినేనిలది కూడా అదే పరిస్తితి. కాపు వర్గం నుంచి నలుగురు మంత్రులు ఉన్నారు.
కొత్తగా ఈ వర్గం నుంచే సామినేని, అటు గుంటూరులో అంబటి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈసారి మాత్రం ఎలాగైనా ఛాన్స్ దక్కించుకోవాలని ఈ ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేసేశారట. కాకపోతే ఇప్పటికే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. వారిని అలాగే ఉంచి జగన్ మరొకరికి ఛాన్స్ ఇస్తారా లేక వారిలో ఎవరోకరిని పక్కనబెట్టి అవకాశం ఇస్తారనేది చూడాలి. ప్రస్తుతానికి ముగ్గురు మంత్రులు బలంగానే ఉన్నారు. నెక్స్ట్ కూడా తమ పదవులు కంటిన్యూ అవుతాయని వారు గట్టిగా నమ్ముతున్నారు. మరి ఇలాంటి తరుణంలో సామినేని, సారథి, మల్లాదిలకు ఛాన్స్ ఎలా వస్తుందో చూడాలి.