Begin typing your search above and press return to search.

కీల‌క నామినేటెడ్ ప‌ద‌వి..ఆ బ్రాహ్మ‌ణ ముఖ్యుడికి ద‌క్కింది

By:  Tupaki Desk   |   12 Jan 2020 3:18 AM GMT
కీల‌క నామినేటెడ్ ప‌ద‌వి..ఆ బ్రాహ్మ‌ణ ముఖ్యుడికి ద‌క్కింది
X
ఏపీలో కీల‌క‌మైన నామినేటెడ్ ప‌ద‌విని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి భ‌ర్తీ చేశారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ గా మల్లాది విష్ణును ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మ‌ల్లాది విష్ణు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మల్లాది విష్ణును బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ గా నియమించడంతో ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియ‌ర్ నేత అయిన మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పోరేషన్‌ చైర్మనుగా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు దేవదాయ శాఖ కార్యదర్శి ఉషారాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి లభించింది. కీల‌క‌మైన ఈ పోస్టుకు సీనియ‌ర్ నేత‌కు ద‌క్కిన‌ గౌర‌వం అని ప‌లువురు పేర్కొంటున్నారు.

ఈ సంద‌ర్భంగా మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ - కీల‌క బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి తెలిపిన‌ మల్లాది విష్ణు బ్రాహ్మణ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్ల‌డించారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, సీఎం లక్ష్యాలకు అనుగుణంగా పని చేసి, బ్రాహ్మణ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. బ్రాహ్మణులకు మూడు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ కే దక్కుతుందన్నారు. వంశపారపర్యానికి ఆమోదం తెలిపి అర్చకుల కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి సీఎం జగన్‌ అని కొనియాడారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ లో పెండింగ్‌ లో ఉన్న కశ్యప పెన్షన్లు - భారతి స్కీమ్‌ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మల్లాది విష్ణు హామీ ఇచ్చారు.