Begin typing your search above and press return to search.
వైసీపీ ప్రశ్న: రేవంత్ కామెంట్స్ పై మౌనం ఎందుకు?
By: Tupaki Desk | 20 Oct 2017 10:05 AM GMTఏపీ సీఎం చంద్రబాబు - ఆయన పరివారంపై విపక్షం వైసీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును టీడీపీ తన ఎన్నికల ప్రాజెక్టుగా మలుచుకుంటోందని నేతలు విమర్శించారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు.. చేస్తున్న విదేశీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని, అవి వ్యక్తిగత పర్యటనలేనని దుయ్యబట్టారు. ఈ మేరకు విజయవాడలోని వైసీపీ ఏపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వైఎస్ ఆర్ సీపీ నేతలు మల్లాది విష్ణు - వెల్లంపల్లి శ్రీనివాస్ -సోమినాయుడు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా అనే పరిస్థితులు నెలకొన్నాయని వారు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ ...టీడీపీకి ఎన్నికల ప్రాజెక్ట్ గా మారిపోయిందని విమర్శించారు. కమీషన్ల కోసమే ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చుతోందని అన్నారు. 2018కి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని, చంద్రబాబు ప్రకటించినా, ఇప్పటికీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఇక, టీ టీడీపీ నేత - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
‘రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చే దమ్ము - ధైర్యం టీడీపీ నేతలకు ఉందా?. ఓటుకు కోట్లు కేసులో సూత్రధారులెవరో రేవంత్ ప్రజలకు చెప్పాలి. దేవినేని ఉమ తాను మంత్రి అన్న సంగతి మరిచిపోయి ఆరోపణలు చేస్తున్నారు. ఉమ ఇసుక మాఫియా కింగ్ అని ఎవరినడిగినా చెబుతారు. ప్రశ్నించినందుకు వైఎస్ ఆర్ సీపీపై అబద్ధాలతో కూడిన ఎదురుదాడికి దిగుతున్నారు.’ అని మల్లాది విష్ణు తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఏపీలో మంత్రులుగా ఉంటూ ...మరోవైపు కేసీఆర్ తో కుమ్మక్కు అయింది వాస్తవం కాదా? సీఎం రమేష్ - యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సుధాకర్ యాదవ్ కు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ లు ఇచ్చింది నిజం కాదా?. ఏపీ ఆర్థిక పరిస్థితి, పోలవరం - అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. మొత్తానికి వైసీపీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.