Begin typing your search above and press return to search.
అవి చంద్రబాబు హయాం నాటి టికెట్లే!
By: Tupaki Desk | 23 Aug 2019 11:35 AM GMTఆర్టీసీ టికెట్లు అంటే చాలా కాలం ముందుగానే వాటి ప్రచురణ జరుగుతుంది. అలా ఆర్టీసీ టికెట్ల వెనుక అడ్వర్టైజ్ మెంట్లను ప్రింట్ చేసి ఆ సంస్థకు ఎంతో కొంత ఆర్థిక లబ్ధి కలిగేలా చేస్తూ ఉన్నారు. ఒక్కసారి టికెట్ల వెనుక యాడ్స్ ముద్రిస్తే ఆ పేపర్ బండిల్స్ రాష్ట్రమంతా వెళ్లిపోతాయి. అందులో భాగంగా తిరుపతి బస్ లకు కూడా ఆ టికెట్లు వెళ్లాయి. వాటి వెనుకేమో హజ్ - జెరుసలేం యాత్రలకు సంబంధించిన యాడ్స్ వచ్చాయి. అది అన్యమత ప్రచారం అని రచ్చ రేగింది.
ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజీగా మార్చుకునే ప్రయత్నం చేసింది. ఇటీవలి కాలంలో బీజేపీ ఇలాంటి ఇష్యూస్ కోసమే ఎదురుచూస్తూ ఉంది. ఈ పరిణామాల్లో తిరుపతి టికెట్ల వ్యవహారంపై కూడా రచ్చ మొదలైంది. ఈ విషయంలో వెంటనే స్పందించి వైఎస్ జగన్ ప్రభుత్వం.
ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి స్పందించారు. అలాగే మల్లాది విష్ణు కూడా రియాక్ట్ అయ్యారు. ఆ టికెట్లు చంద్రబాబు నాయుడు హయాంలో ముద్రితం అయినవే అని వారు తేల్చి చెప్పారు. టికెట్లు ముందుగానే ముద్రించడం జరుగుతుందని - ఆ బండిల్స్ వెనుక యాడ్స్ కూడా అప్పటివే అని ఇప్పుడు వాటి గురించి రాద్ధాంతం చేసి తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.
భారతీయ జనతా పార్టీ వాళ్లు గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలకు తమను నిందించడం ఏమిటని వారు విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ భూములు అన్యాక్రతం అయినా - తక్కువ రేట్లకు అమ్మేసినా బీజేపీ నేతలు మారు మాట్లాడని విషయాన్ని వారు గుర్తు చేశారు. విజయవాడ ప్రాంతంలో భారీగా హైందవ దేవాలయాలను చంద్రబాబు నాయుడు సర్కారు కూల్చేసి బీజేపీ కిమ్మని విషయాన్ని వారు ప్రస్తావించారు. తమ పై బురద జల్లడానికి బీజేపీ తెగ తాపత్రయపడుతూ ఉందని వారు విమర్శించారు. టికెట్ల వ్యవహారంలో సీఎం సీరియస్ అయ్యారని - వాటిని వెనక్కు తీసేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారని పేర్కొన్నారు.