Begin typing your search above and press return to search.
అక్కడ గెలుపోటముల మధ్య తేడా 15 ఓట్లే!
By: Tupaki Desk | 24 May 2019 5:16 AM GMTఅదృష్టం ఉంటే అలానే ఉంటుంది. నువ్వానేనా అన్న రీతిలో పోటీ పడటం తెలుసు కానీ.. ప్రతి ఓటు ఎంత కీలకమైనదన్న విషయం తాజా విజయాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపే.. లక్ష ఓట్లతో గెలిచినా గెలుపే. అయితే.. స్వల్ప మెజార్టీతో గెలిచిన అభ్యర్థి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటే.. ఓడిన అభ్యర్థి లబోదిబోమంటారు.
తాజా ఉదంతం అలాంటిదే. కేవలం 15 ఓట్ల తేడాతో ఎమ్మెల్యే పదవిని ఓడిపోయిన ఉదంతం విజయవాడ సెంట్రల్ లో చోటు చేసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది.. తన నోటిమాటతో అదే పనిగా మీడియాలో కనిపించిన బొండా ఉమ ఉన్నారుగా. అతి స్వల్ప తేడాతో ఓటమి పాలైన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2014లో మంగళగిరి అసెంబ్లీ సీటును 12 ఓట్ల తేడాతో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందటం తెలిసిందే.
తాజాగా అలాంటి గెలుపు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు సొంతమైంది. విజయవాడ సెంట్రల్ ఫలితం మిగిలిన వారితో పోలిస్తే ఆలస్యంగా ఉంది. రౌండ్ రౌండ్ కి మెజార్టీ మారుతూ.. ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠను చివరి మరకూ మిగిల్చింది.
హైటెన్షన్ కౌంటింగ్ లో చివరికు విజయం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి సొంతమైంది. కేవలం 15 ఓట్ల తేడాతో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు విజయం సాధించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 2009లో జరిగిన ఎన్నికల్లోనూ మల్లాది విష్ణు స్వల్ప అధిక్యతతో ఓటమి నుంచి తప్పించుకున్నారు. తాజాగా అలాంటి అదృష్టమే విష్ణుకు వరంగా మారితే.. బొండాకు శాపమైంది.