Begin typing your search above and press return to search.
దేశం మార్కు అసమ్మతి!
By: Tupaki Desk | 18 July 2018 10:22 AM GMTప్రజలలో సానుభూతి కొట్టేసేందుకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు లోక్ సభలో ప్రారంభమయ్యయి. లోక‌్ సభలో బుధవారం నుంచి ప్రారంభమైన వర్షకాల సమావేశాలలో కేంద్రంలో బిజేపి ప్రభుత్వంపై తెలుగుదేశం సభ్యులు అసమ్మతి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో లోక్ సభలో తెలుగుదేశం పార్టీ మరో డ్రామాకు తెరతీసింది. తెలుగుదేశం పెట్టిన ఈ అసమ్మతి తీర్మానానికి స్పీకర్ అమోద ముద్ర వేశారు. అయితే దీనిపై ఇప్పటికిప్పుడు చర్చకు అనుమతించలేమని - వచ్చే పది రోజులలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని సభలో ప్రకటించారు.
ప్రత్యేక హోదా సాధనకు అసమ్మతి తీర్మానం - రాజీనామాలు అవసరం లేదన్న చంద్రబాబు నాయుడు తనను ప్రజలు నమ్మడం లేదన్న భయంతో సభలో అవిశ్వాసం ప్రవేశపెట్టారు. గత సెషన్స్ లో వైసీపీ సభ్యుల రాజీనామాతో తెలుగుదేశం నిరసనలు జనం పట్టించుకోలేదు. దీంతో అపుడు తగినంత మైలేజీ రానందున ఎలాగైన జనం కంటిలో పడటానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈసారి ఇంకో ప్లాన్ వేశారు.
ఇప్పటికే ఏపీని నిలువునా ముంచిన కాంగ్రెస్ పార్టీ - తెలుగుదేశం పార్టీల మధ్య లోపాయికారిగా ఒప్పందం ఉందని జరుగుతున్న ప్రచారానికి బుధవారం లోక్ సభ వేదిక అయింది. తెలుగుదేశం అసమ్మతి తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ లోక్ సభ నాయకులు మల్లికార్జున ఖర్గే అడక్కుండానే వంత పాడారు. దీంతో ఈ రెండు పార్టీల అపవిత్ర కలయిక మరోసారి తేటతేల్లమయింది. అవిశ్వాసం ద్వారా ఎలాంటి ఉపయోగం లేకపోయినా తెలుగుదేశం మనుగడ కోసం ఈ తీర్మానాన్ని పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉండగా టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు పార్లమెంటు వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్ ఏజెంటయిన ఉండవల్లి చర్చల సారాంశాన్ని వారికి వివరించారు. ఏ పరిణామానికైనా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించడంతో మళ్లీ లగడపాటి పెప్పర్ స్ప్రే వంటి పనులు చేసి పేరు సంపాదిస్తారా అంటూ బాబు కామెంట్లపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.