Begin typing your search above and press return to search.
తెలంగాణ స్థితిని ఒప్పేసుకున్న కేసీఆర్
By: Tupaki Desk | 14 Sep 2019 9:40 AM GMTతెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో తెలంగాణ బడ్జెట్ చూసి ధనిక రాష్ట్రం అంటూ కేసీఆర్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ లోటు బడ్జెట్ లోకి పోగా.. తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఉందని అప్పట్లో చెప్పుకున్నారు.
కానీ ఇప్పుడు ఒక దఫా పూర్తయ్యింది. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మాంద్యం దెబ్బకు బడ్జెట్ ను తక్కువ చూపించి ఆపసోపాలతో నడుస్తోందన్నారు.
అయితే తాజాగా తెలంగాణ బడ్జెట్ పై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్ పై కడిగిపారేశారు. ‘రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణను ఆరేళ్లకే కేసీఆర్ దివాళా తీయించాడని.. రాష్ట్రాన్ని హాస్యాస్పదంగా మార్చారు ’ అని భట్టి విమర్శించారు.
అయితే దీనిపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. ‘కొత్త రాష్ట్రం.. అప్పుడే తెచ్చుకున్న రాష్ట్రానికి బడ్జెట్ ఎక్కడుంటుంది.. తయారు చేయడానికే ప్రాతిపదిక లేదు..ఆదాయం ఎంతో, ఖర్చు ఎంతో కూడా కొత్త రాష్ట్రంలో తెలియదు.. రాష్ట్రమే లేకుంటే మిగులు బడ్జెట్ ఎక్కడిది..? ఇదో పెద్ద జోకు.. సభను తప్పుదోవ పట్టించొద్దు’’ అంటూ భట్టిని హెచ్చరించారు. ఎన్నో రాష్ట్రాలకంటే తెలంగాణ బడ్జెట్ ఉత్తమమైనదని కేసీఆర్ వివరించారు.
దీన్ని బట్టి కేసీఆర్ తెలంగాణ వచ్చిన కొత్తలో చెప్పిన మిగులు బడ్జెట్ - ధనికరాష్ట్రం మాట ఉత్తదేనని తేలిపోయింది. లేదంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు కేసీఆరే దివాళా తీయించారన్న భట్టి విమర్శలు నిజమేనని అనిపిస్తోంది. భట్టి ప్రశ్నకు కేసీఆర్ జవాబు చూశాక తెలంగాణ మిగులు బడ్జెట్ నిజానిజాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.