Begin typing your search above and press return to search.

జానాను వాయించి కోదండ‌ను లైట్ తీస్కున్న భ‌ట్టి

By:  Tupaki Desk   |   21 March 2017 11:27 AM GMT
జానాను వాయించి కోదండ‌ను లైట్ తీస్కున్న భ‌ట్టి
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునేది లేదని, త‌మ సొంత ఎజెండాతో ముందుకు పోతామ‌ని ప్ర‌క‌టించిన తెలంగాన జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాంపై కాంగ్రెస్ ఘాటుగానే రియాక్ట‌యింది. టీపీసీసీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క మీడియాతో మాట్లాడుతూ కోదండ‌రాం త‌మ‌తో క‌లిసి వ‌స్తే ఓకేన‌ని రాక‌పోయినా కూడా ప‌ర్లేద‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా రాజకీయాల‌ను ఎదుర్కునే స‌త్తా ఉంద‌ని భ‌ట్టి స్ప‌ష్టం చేశారు. కోదండ‌రాంతో కాంగ్రెస్ క‌లుస్తుంద‌నేది కొంద‌రి అభిప్రాయమే త‌ప్ప త‌మ పార్టీలో అలాంటి చ‌ర్చ కానీ, నిర్ణ‌యం కానీ జ‌ర‌గ‌లేద‌ని భ‌ట్టి వివ‌రించారు. రాబోయే ఎన్నిక‌ల్లో కోదండ‌రాంతో త‌మ‌తో క‌లుస్తారా లేదా అనే విష‌యంలో పెద్ద సీరియ‌స్ చ‌ర్చ‌లేమీ కాంగ్రెస్ పార్టీలో జ‌ర‌గ‌డం లేద‌ని భ‌ట్టి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఆయ‌న మీడియా ప్రతినిధులతో పార్టీ సిద్ధాంతాలతోనే ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. ఇక పార్టీ అంత‌ర్గ రాజ‌కీయాల గురించి సైతం భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడారు. పీసీసీ అధ్య‌క్షుడిగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని, వర్కింగ్‌ ప్రెసిడెంట్ ప‌ద‌వి నుంచి త‌న‌ను మారిస్తే పార్టీ గెలుస్తుందని ఎవరు అనుకుంటున్నారో తెలియదని భట్టి విక్రమార్క అన్నారు. అంతేకాదు క‌లిసిక‌ట్టుగా ఎన్నిక‌ల‌కు వెళ్లే త‌మ‌కు సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదని భ‌ట్టి స్ప‌ష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు పెద్దఎత్తున మారతాయని, కొత్తపార్టీలకు తెలంగాణలో స్థానం ఉండబోదని ఆయ‌న‌ జోస్యం చెప్పారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జానారెడ్డి చేసిన బాహుబలి కామెంట్స్ పై మల్లు రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి అనే వారు సినిమాలకో .. కుస్తీపోటీలకు పొతే మంచిదని అన్నారు. కాంగ్రెస్ కుస్తీపార్టీల పార్టీ కాదు, రాజకీయాల్లో బాహుబలికి స్థానం లేదన్నారు. రాజకీయాలంటే సినిమాలు కాదని, రాజకీయాల్లో బాహుబలులు ఉండరన్నారు. నెహ్రు, ఇందిరా, వైఎస్, బాహుబలు కారన్నారు. సామాన్య ప్రజల మద్దతు కూడగట్టడాం ద్వారనే అధికారంలోకి వస్తారని, బాహుబలులు అయితే అదికారంలోకి రారన్నారు.

మరోవైపు డిప్యూటీ స్పీకర్ ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డిపై భ‌ట్టి విక్ర‌మార్క మండిప‌డ్డారు. డిప్యూటీ స్పీక‌ర్ సభా సంప్రదాయాలు పాటించడం లేదని బడ్జెట్‌ పై చర్చలో వివ‌ర‌ణ‌ల‌కు అవకాశం ఇవ్వలేదని అన్నారు. డిప్యూటీ స్పీకర్ తీరుపై స్పీక‌ర్‌ కు ఫిర్యాదు చేస్తామని భ‌ట్టి తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/