Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఎరువుల ప్లాన్‌ ను కేసీఆర్ కొట్టేశార‌ట‌

By:  Tupaki Desk   |   15 April 2017 4:33 AM GMT
కాంగ్రెస్ ఎరువుల ప్లాన్‌ ను కేసీఆర్ కొట్టేశార‌ట‌
X
తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తే చాలు.. అధికారం హ‌స్త‌గ‌తం అవుతుందంటూ పిచ్చి లెక్క‌లకు పోయి.. రెండు వైపులా న‌ష్ట‌పోయిన గొప్ప‌త‌నం కాంగ్రెస్ పార్టీదేన‌ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ‌లో కాంగ్రెస్ కు ఎదురు ఉండ‌ద‌ని.. ఉద్య‌మం క్లోజ్ అయిన త‌ర్వాత కేసీఆర్ అనే వ్య‌క్తి క‌నిపించ‌కుండా పోతార‌ని.. ఫ్యూచ‌ర్ అంతా కాంగ్రెస్ పార్టీదేన‌ని ప‌గ‌టి క‌ల‌లు క‌న్న కాంగ్రెస్ కు.. త‌న వ్యూహ‌ర‌చ‌న‌తో క‌రెంట్ షాక్ కొట్టేలా చేశారు కేసీఆర్‌. ఆయ‌న పుణ్య‌మా అని.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ఏర్ప‌డి మూడేళ్లు అవుతున్నా.. ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. కాంగ్రెస్ లోని అనైక్య‌త‌.. ఐక‌మ‌త్యంతో పోరాడే నేత‌లు లేక‌పోవ‌టం.. అన్నింటికి మించి ఎవ‌రికి వారుగా చెల్లాచెదురైన నేత‌లంద‌రిని ఒక‌చోట‌కు చేర్చి.. వారిని న‌డిపించే నాయ‌కుడు లేని లోటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ కు ఇప్పుడు శాపంగా మారింది.

ఇది స‌రిపోదన్న‌ట్లు.. తెలంగాణ కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత జానారెడ్డి లాంటి వారి సంగ‌తైతే చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. విప‌క్ష అధినేత అయి ఉండి.. అధికార‌ప‌క్షంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించ‌టం ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లుతుంది. ఆయ‌న వైఖ‌రిపై ఇప్ప‌టికే ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా తాము సిద్ధం చేసుకున్న ప్లాన్‌ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొట్టేశారంటూ తీవ్ర వ్యాఖ్య చేశారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లు ర‌వి.

తాజాగా కేసీఆర్ ప్ర‌క‌టించిన ఉచిత ఎరువుల ప్ర‌క‌ట‌న త‌మ ఎన్నిక‌ల ఎజెండాలోని అంశ‌మ‌ని.. అది కేసీఆర్‌ కు ఎలా చేరిందో అర్థం కావ‌టం లేద‌ని చెబుతున్నారు. మ‌రో రెండేళ్ల‌లో జ‌రిగే ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌కు సంబంధించిన క‌స‌ర‌త్తు జ‌రిగింద‌ని.. అందులో రైతుల‌కు ఎరువులు ఉచితంగా ఇవ్వాల‌న్న అంశాన్ని సిద్ధం చేసుకున్నామ‌ని.. కానీ.. ఈ విష‌యం కేసీఆర్ కు ఎలా చేరిపోయిందో అర్థం కావ‌టం లేద‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే.. రుణ‌మాఫీని ఏక‌మొత్తంగా.. ఏక‌కాలంలో తీసేస్తామ‌ని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించిన వేళ‌లో.. దాన్ని అందిపుచ్చుకున్న‌ట్లుగా కేసీఆర్ అంత‌కు మించి అన్న‌ట్లుగా ఉచిత ఎరువుల ప్ర‌క‌ట‌న చేయ‌టం తెలిసిందే.

రైతులకు ఎరువుల్ని ఉచితంగా ఇచ్చే ప‌థ‌కం బ‌య‌ట‌కు పొక్కినా.. త‌మ అమ్ముల పొదిలో కేసీఆర్‌ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే అస్త్రాలు చాలానే ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఉచితంగా ఎరువులు ఇవ్వాల‌న్న ఆల‌స్యం కేసీఆర్ కు ఉంటే.. ఇంత ఆల‌స్యంగా ఎందుకు ప్ర‌క‌టించార‌ని ప్ర‌శ్నించారు. ఉచిత ఎరువుల్ని వ‌చ్చే ఏడాది నుంచి ఎందుకు అమ‌లు చేస్తార‌ని నిల‌దీస్తున్నారు. తాజాగా చేసిన ఎరువుల ప్ర‌క‌ట‌న గంద‌ర‌గోళంగా ఉంద‌ని.. స‌రైన ప్ర‌ణాళిక లేకుండా చేస్తున్నారంటూ విమ‌ర్శిస్తున్నారు. రైతుల్నిఅధికారులు ఎంపిక చేస్తారా? టీఆర్ ఎస్ నేత‌లు సెలెక్ట్ చేస్తారో చెప్పాలన్న మ‌ల్లుర‌వి.. త‌మ సీక్రెట్స్ ఏ విధంగా కేసీఆర్ కు లీక్ అవుతున్నాయ‌న్న విష‌యం మీద దృష్టి పెట్ట‌నున్న‌ట్లు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/