Begin typing your search above and press return to search.
పవన్ ను నమ్మాడు.. జైలుపాలయ్యాడట!!
By: Tupaki Desk | 5 April 2017 8:19 AM GMTప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు ఇప్పుడు పలు సందేహాలకు తావిస్తోంది. తాను చేసేది మాత్రమే చెబుతానని.. తాను ఏదైనా విషయాన్ని చెప్పే ముందు చాలా ఆలోచిస్తానని.. అన్నికోణాల్లో ఆలోచించిన తర్వాత మాత్రమే తాను మాట్లాడతానే తప్పించి.. మిగిలిన వారి మాదిరి అనవసరంగా మాట్లాడటం తనకుఇష్టపడని చెప్పటం తెలిసిందే. తాను బాధ్యతగా వ్యవహరిస్తానని.. మిగిలిన రాజకీయ నేతల మాదిరి తన తీరు ఉంటుందని చెప్పుకోవటం తెలిసిందే.
అయితే.. పవన్ చెప్పే మాటలకు ఆయన చేతలకు సంబంధం ఉండటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే తుపాకీకి ఎదురొడ్డి నిలవటానికైనా సిద్ధమేనని.. పోరాటాలు చేసేందుకు ఎంతకైనా తాను సిద్ధమేనని చెప్పటం తెలిసిందే. కొన్ని అంశాల విషయంలో తాను నిరసన చేస్తానని.. అవసరమైతే దీక్షలు కూడా చేస్తానని చెప్పటం తెలిసిందే.
పవన్ మాటల్ని నమ్మి.. ఉద్యమగోదాలో దూసుకెళ్లిన ఒకరు ఇప్పుడు జైలుపాలు అయ్యారన్న విమర్శ వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా తుండూరులో తలపెట్టిన మెగా అక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా విశ్వ మానవ వేదిక పోరాడుతోంది. ఈ వేదిక అధ్యక్షుడు మల్లుల సురేశ్ మెగా అక్వాఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడుతున్నారు. తన పోరాటంలో భాగంగా పవన్ కల్యాణ్ ను కలవటం.. సురేశ్ ఉద్యమానికి తాను అండగా నిలుస్తానని.. అవసరమైతే తానీ విషయంలో దీక్ష చేయటానికైనా సిద్ధమేనని ప్రకటించారు.
పవన్‌ను నమ్మిన సురేశ్.. మెగా అక్వాఫుడ్ పార్క్ మీద తన పోరాటాన్ని ఉధృతం చేయటం.. స్థానిక అధికారపక్ష నేతల నుంచి దాడులు ఎక్కువ కావటమే కాదు.. పలు కేసులు మోపి ఆయన్ను జైలుపాలు చేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఫుడ్ పార్క్ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే దీక్ష చేస్తానని చెప్పిన ఆయన.. ఆ విషయంపై తర్వాత మాట్లాడకపోవటం.. ఆయన్ను నమ్ముకొని పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన మల్లుల సురేశ్ కేసుల చిక్కుల్లో చిక్కుకొని జైలుపాలు కావటం పవన్ పుణ్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయం మీద విశాఖ ఆర్కే బీచ్‌లో శాంతియుత దీక్ష చేస్తానని గతంలో ప్రకటించిన పవన్.. ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తకపోవటాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. తనను నమ్మినోళ్లను పవన్ ఇంతలా దెబ్బేయటం ఏమిటి..? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/