Begin typing your search above and press return to search.
మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్
By: Tupaki Desk | 18 April 2016 5:14 PM GMTలిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఊహించని షాక్ తగిలింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రత్యేక కోర్టు ఈ రోజు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు బకాయిలు పడ్డ విజయ్ మాల్యా పాస్ పోర్టు రద్దు అయిన విషయం విదితమే. ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సిఫార్సుతో మాల్యా పాస్ పోర్టును రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ గత వారం తెలిపింది. మనీలాండరింగ్ కేసులో ఆయనపై కేసు నమోదు చేసిన ఈడీ.. దీనిపై విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు పంపినా హాజరుకాలేదు. దీంతో మాల్యా పాస్ పోర్టును రద్దు చేయాలని విదేశాంగశాఖకు ఈడీ సిఫార్సు చేసింది.
ప్రస్తుతం లండన్ లో ఉన్న మాల్యాను విచారణకు హాజరు కావాలని ఈడీ మూడుసార్లు సమన్లు పంపింది. తాజాగా ఏప్రిల్ 9న మాల్యా విచారణకు హాజరుకాకుండా తనకు మే చివరి వరకు గడువు కావాలని కోరారు. మాల్యాను దేశం విడిచి పోకుండా కట్టడి చేయాలని గతంలో బ్యాంకులు చేసిన విజ్ఞప్తితో… పాస్ పోర్టుతో కోర్టులో హాజరుకావాలని మాల్యాను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆయన అప్పటికే దేశం విడిచి లండన్ వెళ్లిపోయారు. తిరిగి ఆయన్ను రప్పించే క్రమంలో ఇపుడు బ్యాంకులు అవస్తలు పడాల్సి వస్తోంది.