Begin typing your search above and press return to search.

ఆమెకు మంత్రి ప‌ద‌వి.. క‌విత‌కు న‌చ్చ‌లేదా..?

By:  Tupaki Desk   |   20 Sep 2019 9:50 AM GMT
ఆమెకు మంత్రి ప‌ద‌వి.. క‌విత‌కు న‌చ్చ‌లేదా..?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ తాజా కేబినెట్ విస్తరణలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. కెసిఆర్ రెండోసారి కేబినెట్‌ ను విస్తరించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తి జ్వాలలు రగులుతున్న సంగతి తెలిసిందే. పలువురు ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి రాకపోవడంతో ఏదో ఒక రూపంలో తమ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళా ఎంపీ సైతం కెసిఆర్‌ ను కలిసి తన ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ తాజా విస్తరణలో సబితా ఇంద్రారెడ్డి తోపాటు వరంగల్ జిల్లాకు చెందిన సత్యవతి రాథోడ్‌ కు సైతం మంత్రి పదవి ఇచ్చారు.

సత్యవతికి గిరిజన సంక్షేమ - మహిళా శిశు సంక్షేమ శాఖ కేసీఆర్ కట్టబెట్టారు. ఆమెకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని ఆమె సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ సీనియర్ నేత డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తో పాటు ఆయన కుమార్తె మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మంత్రి కేటీఆర్ ను కలిశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేటీఆర్ ను కలిసిన వీరు తమ అసంతృప్తిని కేటీఆర్ ముందు వెళ్లగక్కారు.

తాము కూడా పార్టీలో సీనియర్లుగా - సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నామని - వరంగల్ జిల్లాలోనే సీనియర్ నేతనని రెడ్యానాయక్.. కేటీఆర్‌ కు చెప్పి ఒకింత ఆవేదనకు లోనయ్యారని తెలుస్తోంది. వాస్త‌వంగా చూస్తే ఎస్టీ సామాజిక వ‌ర్గం కోటాలో రెడ్యానాయ‌క్‌ కే మంత్రి ప‌ద‌వి వస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఇటీవ‌ల లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమార్తె క‌విత‌కు మ‌హ‌బూబాబాద్ ఎంపీ సీటు ఇవ్వ‌డంతో పాటు ఆమె గెల‌వ‌డం జ‌రిగాయి.

ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్సీగా ఉన్న స‌త్య‌వ‌తికి కేసీఆర్ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. దీంతో రెడ్యానాయ‌క్‌ తో పాటు ఎంపీ క‌విత జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక ఈ తండ్రి కూతుళ్లు ఇద్ద‌రు కేటీఆర్ ముందు త‌మ అసంతృప్తి వ్య‌క్తం చేయడంతో ఆయ‌న త్వరలోనే తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. మ‌రి రెడ్యానాయక్‌ కు కేటీఆర్ హామీతో ఎలాంటి ప‌ద‌వి దక్క‌బోతుందో ? చూడాలి.