Begin typing your search above and press return to search.
దీదీ కారు దిగితే.. ఏమైందో తెలుసా?
By: Tupaki Desk | 5 May 2019 6:10 AM GMTహీరో ఎంత పవర్ ఫుల్ అన్నది చెప్పటానికి టాలీవుడ్ దర్శకులు పడే శ్రమ అంతా ఇంతా కాదు. అయితే.. ఇప్పటివరకూ రీల్ లో కనిపించని ఒక కొత్త తరహా సీన్ రియల్ లో దర్శనమిచ్చింది. నిజానికి ఈ సీన్ ను టాలీవుడ్ దర్శకులకు తెలిస్తే.. తమ సినిమాలో అదిరిపోయేలా.. హీరోయిజం పండేలా తీసే అవకాశం ఉంది.
రీల్ లో కనిపించని రియల్ హీరోయిజం ఎలా ఉంటుందో చూపించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి.. దీదీగా అందరికి సుపరిచితురాలు మమతా బెనర్జీ.
తన కంటిచూపుతో రాష్ట్రాన్ని ఎంతలా కమాండ్ చేస్తారో.. అదే తీరుతో ప్రత్యర్థి పార్టీ నేతల్ని.. కార్యకర్తల్ని కంట్రోల్ చేసే సత్తా ఆమె సొంతం. గతానికి భిన్నంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయని.. మోడీషాలు స్వయంగా ఫోకస్ చేసిన నేపథ్యంలో.. పశ్చిమబెంగాల్ లో ఈసారి ఫలితాలు అనూహ్యంగా ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. అదే సమయంలో మమత పట్టు కాస్త సడలిందన్న అభిప్రాయం ఉంది.
ఇలాంటి వేళ.. తన పవర్ ఏమిటో తాజాగా చూపించారు దీదీ. ఆమె అంటే ప్రత్యర్థులకు ఎంత వణుకన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. వెస్ట్ మిడ్నాపూర్ లో కొందరు దీదీని చూసి జైశ్రీరాం.. అంటూ నినాదాలు చేస్తుండిపోయారు. ఆమెను ఇరిటేట్ చేయాలన్నది వారి ఉద్దేశంగా చెప్పాలి. ఒక బహిరంగ సభకు వెళ్లే దారిలో మమతకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది.
ఇలాంటివి చూస్తే మమతకు చిర్రెత్తుకొస్తుంది. తనను కెలికే ప్రయత్నం చేసినా.. తన జోలికి వచ్చిన వారిని మమత అస్సలు ఊరుకోరు. తాను వెళుతుంటే.. జైశ్రీరాం అంటూ నినాదాలు చేస్తారా? అని చిర్రెత్తుకొచ్చిన ఆమె.. తన కారు డ్రైవర్ కు కారు ఆపాలని కోరారు. కారు ఆగినంతనే.. కారు లో నుంచి బయటకు దిగిన మమతను చూసి.. అప్పటివరకూ ఆందోళనలు చేస్తున్న వారంతా పరుగులు తీశారు. దీదీ.. జస్ట్ కారు దిగితేనే ఇంతగా భయపడే పరిస్థితి అయితే..ఇక ఆమె చేతల్లోకి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పొచ్చంటున్నారు.
దీనికి తగ్గట్లే.. ఈ సందర్భంగా మమత మాటల్ని వింటే.. ప్రత్యర్థుల భయానికి కారణం ఇట్టే అర్థం కాక మానదు. ఎందుకు పారిపోతున్నారు. ఇలా రండి అని పిలిచిన ఆమె.. వాళ్లంతా తెలివిగా తప్పించుకుంటున్నారు. నినాదాలు చేస్తున్న వారంతా మే 23 ఎన్నికల ఫలితాలు చూసి బాధ పడాల్సి వస్తుంది. ఎన్నికల తర్వాత కూడా వారు ఈ రాష్ట్రంలోనే ఉంటారని గుర్తుంచుకోవాలన్న ఆమె వార్నింగ్ వింటే.. అసలు విషయం ఇట్టే అర్థం కాక మానదు. మొత్తానికి దీదీ హవా ఎంతన్న విషయాన్ని తాజా ఎపిసోడ్ చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి.