Begin typing your search above and press return to search.

మోడీ గాలి తీసిన దీదీ..

By:  Tupaki Desk   |   12 Jan 2019 7:17 AM GMT
మోడీ గాలి తీసిన దీదీ..
X
ప్రధాని మోడీకి ఇంగ్లీష్ మాట్లాడడం సరిగా రాదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.ఇంగ్లీష్ లో ఆయన మాట్లాడాలనుకుంటే టెలిప్రాంప్టర్ సాయం తీసుకుంటున్నారని దీదీ దెప్పిపొడిచారు. కనీసం ఒక్క వాఖ్యమైనా ఇంగ్లీష్ లో మోడీ సొంతంగా మాట్లాడలేడని.. ఆయనకు ఎప్పుడూ టెలిప్రాంప్టర్ సాయం అవసరం ఉండాల్సిందేనని విమర్శించారు.

మోడీ చాలా ప్రసంగాలు చేస్తారని.. కానీ ఇంగ్లీష్ మాత్రం రాదని.. మొత్తం మీడియాకు, ప్రజలకు కూడా ఈ విషయం తెలుసు అంటూ మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడే మొదట స్క్రీన్ చూస్తారని.. ఇంగ్లీష్ లో ఏం చెప్పాలో చూసి ఆ తర్వాత పెద్ద భాషా తెలిసిన వాడిలా స్పీచ్ ఇస్తారని మమతా సంచలన ఆరోపణలు చేశారు. కానీ ఇది తమకు అవసరం లేదని మమతా చెప్పినట్టు కోల్ కత కు చెందిన ఓ వెబ్ సైట్ సంచలన కథనం ప్రచురించింది.

మోడీ పథకాలు ఫ్లాప్ అని.. గత ఏడాది మోడీ ప్రారంభించిన ఆరోగ్యపథకం ఆయుష్మాన్ భారత్ ను తాము అమలు చేయమని మమత కుండబద్దలు కొట్టారు. ఈ పథకంపై మోడీ డర్టీ పాలిటిక్స్ ను చేస్తున్నారని మమత దుయ్యబట్టారు. ‘ఈ స్కీమ్ అమలు చేయడం లేదని మోడీ ఫొటోతో ఉన్న లేఖలను బెంగాల్ అంతటా ప్రతి ఇంటికి పంపుతున్నారని.. మీవీ చీప్ పాలిటిక్స్ అంటూ మమత నిప్పులు చెరిగారు.

ఇక మమతా బెనర్జీ కాంగ్రెస్ ను వదలలేదు. ఇటీవలే విడుదలైన ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీ’ని దేశ ప్రజలంతా చూడబోతున్నారని సెటైర్ వేశారు. లోక్ సభ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీకి ఓటమి తప్పదని మమతా స్పష్టం చేశారు.