Begin typing your search above and press return to search.

జై శ్రీ‌రామ్‌ కు కౌంట‌ర్ అటాక్ మొద‌లెట్టిన దీదీ!

By:  Tupaki Desk   |   4 Jun 2019 5:15 AM GMT
జై శ్రీ‌రామ్‌ కు కౌంట‌ర్ అటాక్ మొద‌లెట్టిన దీదీ!
X
పోయిన చోటే వెతుక్కోవ‌టం కొంద‌రు చేస్తుంటారు. స‌రిగ్గా ఇదే ప‌నిని చేస్తున్నారు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ. త‌న‌ను అమితంగా ఇరిటేట్ చేస్తున్న విష‌యాన్నే ఆయుధంగా మార్చుకొని ప్ర‌త్య‌ర్థుల‌ను డిఫెన్స్ లో ప‌డేసే వ్యూహాన్ని ఆమె తెర మీద‌కు తీసుకొచ్చారు. తాను క‌నిపించినంత‌నే త‌న‌కు చిరాకు తెప్పించేలా జైశ్రీ‌రామ్ అంటూ బీజేపీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు.. అభిమానులు చెల‌రేగిపోతున్న వేళ‌.. తాను బ్యాలెన్స్ త‌ప్పుతున్న విష‌యాన్ని దీదీ గుర్తించిన‌ట్లున్నారు.

అందుకేనేమో.. తాను ఏ విష‌యం మీద అదే ప‌నిగా రియాక్ట్ అవుతున్నానో.. ఇప్పుడు అదే అంశం మీద ఆమె కొత్త కౌంట‌ర్ అటాక్ మొద‌లెట్టారు. జైశ్రీ‌రాంతో త‌న‌ను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి జైసీతారామ్ నినాదం పేరుతో దీదీ ఎదురుదాడి మొద‌లెట్టారు.

జైసీతారామ్ నినాదాన్ని బీజేపీ వ‌క్రీక‌రించింద‌ని.. యూపీలో జైసీతారామ్ అంటార‌ని.. అంటే సీతారాముల‌ను కీర్తించ‌ట‌మ‌న్నారు. మ‌హాత్మా గాంధీ కూడా ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారామ్.. ప‌తిత పావ‌న సీతారామ్ అన్నార‌ని.. కానీ బీజేపీనేత‌లు మాత్రం సీతామాత పేరును తొల‌గించి.. అస‌లు నినాదాన్ని వ‌క్రీక‌రించింద‌న్నారు.

జైసీతారామ్ నినాదం స్థానే.. జైశ్రీ‌రాం అంటూ కొత్త నినాదాన్ని తెచ్చిన‌ట్లుగా ఆమె వ్యాఖ్యానించారు. జైశ్రీ‌రాం నినాదంతో త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్న ఆమె.. మ‌తాన్ని.. రాజ‌కీయాన్ని క‌ల‌గ‌లిపి బెంగాల్లో అస్థిరత సృష్టించేందుకు బీజేపీ దానిని ఉప‌యోగిస్తుంద‌న్నారు.

తాను బీజేపీ ట్రాప్ లో ప‌డ‌న‌న్న ఆమె.. త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్ మార్చేశారు. మ‌హాత్మాగాంధీ.. సుభాష్ చంద్ర‌బోస్.. భ‌గ‌త్ సింగ్.. మాతంగిని హ‌జ్రా.. ర‌బీంద్ర‌నాథ్ ఠాగూర్.. ఖాజీ నెహ్రుల్ ఇస్లాం ఫోటోల‌తో పాటు.. జైహింద్.. జై బంగ్లా నినాదాలు ఉంచిన ఫోటోతో మార్చారు.

దీదీ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే.. ఆమె తాజా వ్యాఖ్య‌లు బీజేపీ నేత‌ల్ని ఇరిటేట్ చేశాయి. మ‌మ‌త ప్ర‌వ‌ర్త‌న అసాధార‌ణంగా.. అనాగ‌రికంగా ఉందంటూ కేంద్ర‌మంత్రి బాబుల్ సుప్రియో విమ‌ర్శించారు. సీఎం ప‌ద‌వికి ఉండే గౌర‌వాన్ని ఆమె దృష్టిలో ఉంచుకోవాల‌ని..కొన్నాళ్లు ఆమె రెస్ట్ తీసుకుంటే మంచిద‌ని వ్యాఖ్యానించారు. చూస్తుంటే.. దీదీ వ‌ర్సెస్ బీజేపీ మ‌ధ్య అధిప‌త్య పోరు అంత‌కంత‌కూ ఎక్కువ కావ‌టం ఖాయ‌మ‌న్న‌ట్లుగా ప‌రిణామాలున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.