Begin typing your search above and press return to search.
మమత కొత్త డిమాండ్..ఆ స్వీట్ మాదే
By: Tupaki Desk | 27 Aug 2015 12:05 PM GMTబెంగాలీ దీదీ మమతాబెనర్జీ సరికొత్త డిమాండ్ ను తెచ్చారు. ఇప్పటి వరకు మాకు వేప చెట్టు మీద పేటెంట్ కావాలి..ఈత చెట్టు మీద పేటెంట్ కావాలి...తాడిచెట్టు మీద పేటెంట్ కావాలని డిమాండ్ చేయడం చూశాం. సొత్తు మనది అయినప్పుడు మనకు పేటెంట్ లేకపోతే సోకు ఇంకొకడు అనుభవిస్తాడు. ఒంగోలు గిత్తలకు ఏపీలోని ప్రకాశం జిల్లా ఫేమస్. అక్కడ పుట్టిన గిత్తలు ఇప్పుడు బ్రెజిల్ కు భారీగా విదేశీ మారకద్ర్యవ్యాన్ని ఆర్జించిపెడుతున్నాయి. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం ఇప్పుడు వీటికి ఆదరణ లేకుండా పోతోంది. ముందు జాగ్రత్తలు లేకపోతే ఒంగోలు గిత్తల చరిత్రలాగానే మనదేశ సంస్కృతిలో మిళితమై...ఎంతో విలువైన వాటిపై మనం హక్కు కోల్పోతాం.
దేశవ్యాప్తంగా తన టేస్ట్ ను చూపిస్తూ...నోట్లో వేసుకుంటే కరిగిపోయే రసగుల్లా స్వీట్ తమదేనంటూ బెంగాల్ ప్రజలు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఈ డిమాండ్ కు మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా ఓకే చెప్పేసిందట. 1968లో నవీన్ చంద్రాదాస్ బెంగాలీలకు ఈ స్వీట్ ను పరిచయం చేశాడు. తర్వాత ఈ రసగుల్లా వారి సంస్కృతిలో ఒక భాగమైపోయింది. బెంగాళీలో అన్ని వివాహాది శుభకార్యాల్లో రసగుల్లా మెనూలో తప్పనిసరిగా ఉండాల్సిందే.
బెంగాళ్ సంస్కృతిలో అంత అంతర్భాగమైన ఈ స్వీట్ పై ఎవ్వరికి పెటెంట్ హక్కులు లేకుండా బెంగాల్ రాష్ర్ట స్వీటుగా గుర్తించాలని ఆ రాష్ర్ట ప్రజలు కోరుతున్నారు. ఇందుకోసం దీదీ ఈ స్వీటు పుట్టుక ..ఇది ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ తో పరిశోధన చేయిస్తున్నారు. రసగుల్లా పుట్టుక గురించి పూర్తి సమాచారంతో కూడిన నివేదిక బెంగాల్ ప్రభుత్వం చేతికి అందాక ప్రభుత్వ సీల్ తో కూడిన ఒరిజినల్ రసగుల్లా ప్యాక్ లు అందుబాటులోకి రానున్నాయి.