Begin typing your search above and press return to search.
నేనో పెద్ద గాడిదను.. ద్రోహులను గుర్తించలేకపోయా: మమత
By: Tupaki Desk | 21 March 2021 4:30 PM GMTబెంగాల్ ఎన్నికల్లో మాటల మంటలు చెలరేగుతున్నాయి. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ బీజేపీని, ఆ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మోడీ, అమిత్ షా, సువేందు అధికారిపై మమత విరుచుకుపడుతున్నారు.
మొన్నటిదాకా మమత కేబినెట్ లో మంత్రిగా, టీఎంసీలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి కొన్నాళ్ల కిందటే బీజేపీలో చేరి ఇప్పుడు బెంగాల్ సీఎం మమతపై నందిగ్రామ్ లో పోటీచేస్తూ సవాల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సువేందుపై మమత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు సువేందు నిజస్వరూపం తెలుసుకోలేకపోయానని.. నేనో పెద్ద గాడిదను అని అన్నారు. మేకవన్నె పులలను గుర్తించలేకపోయానని.. ద్రోహుల నిజస్వరూపం తెలుసుకోలేకపోయానన్నారు.
సువేందు అధికారి కుటుంబం రూ.5వేల కోట్లతో పెద్ద అవినీతి సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుందని చెబుతున్నారని.. ఆ డబ్బుతో ఎన్నికల్లో ఓటర్లను కొనబోతున్నారని మమత ఆరోపించారు. అలాంటి వారికి ఓటు వేయకండి అని మమత వ్యాఖ్యానించారు.
నందిగ్రామ్ లో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని సువేందుకు కుటుంబం తమ ఖాతాలోకి వేసుకుంటోందని.. అభివృద్ధి కొనసాగాలంటే బీజేపీని బెంగాల్ కు దూరం పెట్టాలని మమత పిలుపునిచ్చారు.