Begin typing your search above and press return to search.
చంద్రబాబును ఇన్ సల్ట్ చేసిన మమతా బెనర్జీ?
By: Tupaki Desk | 11 May 2019 6:30 AM GMTఅలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా.. ఎన్నికల ఫలితాలు రాకనే తాము ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామంటూ హడావుడి చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ నుంచి క్లాస్ పడిందని సమాచారం. చంద్రబాబు నాయుడు పీఎం అభ్యర్థిని డిసైడ్ చేసేయడానికి చాలా తహతహలాడిపోతూ ఉన్నారు.
ఇప్పటికే ఈ విషయంలో ఆయన ఒక తేదీ కూడా ప్రకటించేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు రావడానికి రెండు రోజుల ముందే తాము ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇది వరకే. మే ఇరవై ఒకటో తేదీన తమ కూటమిలోని పార్టీలన్నీ సమావేశం అవుతాయని.. ఆ రోజునే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించడం ఉంటుందని చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు ఇప్పటికే.
అది అసలు సాధ్యమేనా? అనే సందేహాలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ నుంచి కూడా చంద్రబాబుకు ఈ విషయంలో నే గట్టి క్లాస్ పడిందట. 'మీరు ఎందుకు అప్పుడే హడావుడి చేస్తూ ఉన్నారు. ఫలితాలు రాకుండానే ప్రధానమంత్రి అభ్యర్థిని ఎలా నిర్ణయిస్తారు? అదెలా సాధ్యం అవుతుంది? అయినా మీకు ఎన్ని సీట్లు వస్తాయో కూడా తెలీదు.
సర్వేలన్నీ మీకువ్యతిరేకంగానే వస్తున్నాయి. ఐదారు ఎంపీ సీట్లే మీకు వస్తాయని కూడా అంటున్నారు. అలాంటప్పుడు మీరు ఎందుకు పీఎం అభ్యర్థి విషయంలో మాట్లాడుతున్నారు. మే ఇరవై ఒకటిన మీటింగ్ అంటూ మీరెలా చెబుతారు?' అంటూ చంద్రబాబుకు మమతా బెనర్జీ గట్టి క్లాస్ పీకిందని సమాచారం. పీఎం అభ్యర్థిత్వం విషయంలో రన్నింగ్ కామెంట్రీ చెబుతున్న చంద్రబాబుకు ఇది ఇన్ సల్టే అని చెప్పవచ్చు.