Begin typing your search above and press return to search.
ఏపీలో మమతకు దోస్తులే లేరా... ?
By: Tupaki Desk | 21 March 2022 3:30 AM GMTఏపీ దేశంలో అతి ముఖ్యమైన స్థానంలో ఉంది. ఏకంగా పాతిక ఎంపీ సీట్లు ఉన్నాయి. రెండు సార్లు యూపీఏ సర్కార్ అధికారంలోకి రావడానికి ఏపీ పాత్ర నాడు చాలా ఉంది. అలాంటి ఏపీ విభజన తరువాత పూర్వపు రాజకీయ ప్రతిపత్తిని కోల్పోయిందా అన్న చర్చ అయితే సాగుతోంది.
ఏపీలో చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు నాలుగేళ్ల పాటు బీజేపీతో మైత్రి నెరిపారు. 2018లో కాషాయ అజెండాకు టాటా చెప్పేశాక విపక్ష కూటమిలోకి బాబు చేరి జోరుగా రాజకీయం నడిపించారు. 2019 ఎన్నికల వేళ అయితే మోడీ వర్సెస్ బాబు అన్నట్లుగానే సీన్ క్రియేట్ అయింది.
నాడు ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా మమతా బెనర్జీ బెంగాల్ నుంచి వచ్చారు. ఇక ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ వచ్చారు. విశాఖ సహా చాలా చోట్ల ఈ ఇద్దరూ ప్రసంగాలు చేశారు. అలా తమ మిత్రుడిగా బాబుని చూశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు అయింది.
ఇక నాటి తరువాత బాబు కూడా జాతీయ రాజకీయ వైపు చూడలేదు. మరో వైపు చూస్తే గత ఏడాది చావో రేవో అన్నట్లుగా సాగిన బెంగాల్ ఎన్నికల వేళ మమత గట్టి పోరాటమే చేసింది. దేశంలోని అనేక పార్టీలు ఆమెకు మద్దతు ఇచ్చినా ఏపీ నుంచి రాజకీయ సాయమేదీ అందలేదు. అప్పటికే బాబు బీజేపీ కోసం ప్రేమ లేఖలు రాసే పనిలో బిజీగా ఉన్నారని చెబుతారు.
మొత్తానికి హ్యాట్రిక్ విజయాన్ని మమత నమోదు చేశాక దేశ రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. అపుడు కూడా ఆమె ఏపీలో అధికార వైసీపీని కలుపుకునిపోవడానికి చూశారు. కానీ ఇటు నుంచి నో రెస్పాన్స్. ఇక చంద్రబాబు విషయం కూడా డిటోగానే ఉంది. దాంతో మమత లేటెస్ట్ గా అసెంబ్లీలో పెగాసిస్ విషయంలో ఏపీలో నాటి చంద్రబాబు సర్కార్ మీద పెద్ద ఆరోపణే చేశారు.
దాంతో ఇది నిజంగా బాబుకు ఊహించని పరిణామమే అంటున్నారు. మమతను ఏమీ అనలేని పరిస్థితి. అదే టైం లో ఏపీలో చూసుకుంటే రాజకీయంగా ఇరకాటంలో పడ్డారు. ఇక కేంద్రం కూడా ఈ విషయం మీద దృష్టి పెడితే మరింత ఇబ్బంది. మొత్తానికి బాబు ఇలా కార్నర్ కావడానికి మమతాగ్రహమే కారణం అంటున్నారు.
అటు జగన్ తో ఆమె ఈ మధ్య పెద్దగా విపక్ష కూటమి రాజకీయల మీద సంప్రదింపులు జరపడంలేదు అంటున్నారు. ఇపుడు బాబు మీద కూడా గురి చూసి బాణం వేసి నాకు దోస్త్ కాదనేశారు. దీన్ని బట్టి చూస్తే మమతకు ఏపీలో అయితే ఎవరూ ఫ్రెండ్స్ లేరని తేలిపోతోంది. చూడాలి మరి ఏపీలో ఈ రాజకీయం ఏ వైపునకు సాగుతుందో.