Begin typing your search above and press return to search.
నందిగ్రామ్ నుంచి పోటీచేస్తా.. దీదీ సంచలన ప్రకటన..!
By: Tupaki Desk | 18 Jan 2021 2:30 PM GMTపశ్చిమబెంగాల్ సీఎం, ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీచేయబోతున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమబెంగాల్లో నందిగ్రామ్ నియోజకవర్గం ఎంతో కీలకమైనని. ఎందుకంటే పశ్చిమబెంగాల్లో అనేక ఏళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న తృణముల్ కాంగ్రెస్ నందిగ్రామ్‌లో జరిగిన పోరాటంతో అధికారంలోకి వచ్చింది. నందిగ్రామ్ పోరాటంతో ఆ పార్టీ పశ్చిమబెంగాల్లో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగింది.
సోమవారం తృణముల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నందిగ్రామ్‌లో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఈ సభలో దీదీ మాట్లాడుతూ తాను నందిగ్రామ్ నుంచి పోటీచేస్తున్నట్టు ప్రకటించారు. అయితే తాను కోల్‌కతాలోని భభిన్పూర్ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తానని ఆమె ప్రకటించారు. నిజానికి 2011లో నందిగ్రామ్ భారీ ఉద్యమం మొదలైంది. నందిగ్రామ్ నియోజకవర్గం తృణముల్ కాంగ్రెస్‌కు రాజకీయంగా ఎంతో కలిసివచ్చింది. 2007లో పశ్చిమబెంగాల్లో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ ఫ్రభుత్వం నందిగ్రామ్‌లో సెజ్‌కు అనుమతులు ఇచ్చింది. అయితే దీనిపై అప్పట్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రైతులకు మద్దతుగా తృణముల్ కాంగ్రెస్ ఎన్నోపోరాటాలు చేసింది.
ఈ ఆందోళనల్లో 14 మంది రైతులను పోలీసులు కాల్చిచంపారు. దీంతో ఉద్యమం మరింత తీవ్రమైంది. మమతా బెనర్జీ “మా మట్టి మనుష్” పేరుతో పర్యటించి రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీని బలోపేతం చేశారు. అయితే నందిగ్రామ్ ఉద్యమంలో సువేందు అధికారి అనే నేత కీలకపాత్రం పోషించారు. అయితే ఆయన ఇటీవల బీజేపీలో చేరారు. దీంతో మమత ఇక్కడి నుంచే పోటీచేస్తానని ప్రకటిండం గమనార్హం.నందిగ్రామ్ ఉద్యమాన్ని ఇప్పటికీ తమ ఖాతాలో వేసుకోవాలని ఆమె భావిస్తున్నారు. అయితే మమత నిర్ణయం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.