Begin typing your search above and press return to search.
‘టీ’ మార్క్ ప్రచారం.. పాత ట్రిక్కే ఈసారి కూడానా దీదీ?
By: Tupaki Desk | 10 March 2021 9:30 AM GMTఎన్నికల వేళ.. ప్రచారం సరికొత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రచార ట్రిక్కుల్ని మార్చేస్తుండాలి. కానీ.. ఈ విషయంలో పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెనుకబడి ఉన్నారని చెప్పాలి. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఏ విధమైన ప్రచారం చేశారో.. ఇప్పుడు అదే ప్రచారాన్ని ఆమె షురూ చేయటం గమనార్హం. తాజా ఎన్నికల్లో ఆమె నందిగ్రామ్ లో పోటీ చేస్తున్నారు.
తన పార్టీలో ప్రముఖ నేతగా సుపరిచితుడైన సువేందు అధికారి.. పార్టీని వీడి బీజేపీలోకి చేరిన వైనం తెలిసిందే. అతడు బరిలోకి దిగిన నందిగ్రామ్ లోనే మమత ఈసారి పోటీ చేస్తున్నారు. తాను బరిలో ఉన్న నియోజకవర్గం తనకు కొత్త కావటంతో.. తన ప్రచారాన్ని తాజాగా అక్కడ నిర్వహించారు. నందిగ్రామ్ పర్యటించిన ఆమె.. రోడ్డు పక్కనున్న టీ స్టాల్ వద్దకు వెళ్లి.. తానే స్వయంగా టీ కాచారు. దాన్ని వడబోసి.. కప్పుల్లో పోసి అక్కడి వారికి స్వయంగా సర్వ్ చేశారు.
అనంతరం అందరితో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలోనూ ఎన్నికల సందర్భంగా టీ కాచే ప్రచార వ్యూహాన్ని మమత అమలు చేశారు. ఇంతకాలం తనకు కలిసి వచ్చిన టీ కాచే ప్రచార వ్యూహం తాజాగా వర్క్ వుట్ అవుతుందా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.