Begin typing your search above and press return to search.
బాబు ప్రధాని..ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత!
By: Tupaki Desk | 27 April 2019 9:25 AM GMTఒకవైపు ఏపీలో చంద్రబాబు పార్టీకి వచ్చే ఎంపీ సీట్లు ఎన్ని అనే అంశం గురించి గట్టి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే పోలింగ్ ముగిసిన నేపథ్యంలో.. బాబు పార్టీ సాధించే ఎంపీ సీట్లు ఎన్ని అనే అంశంపై ఆసక్తిదాయకమైన అంశంగా నిలుస్తూ ఉంది.
ప్రీ పోల్ సర్వేలేమో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో చిత్తు అవుతుందని అంచనా వేశాయి. జాతీయ మీడియా వర్గాల సర్వేల ప్రకారం తెలుగుదేశం పార్టీకి మూడు నుంచి ఆరు ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని అంచనా. ఏపీలో పోలింగ్ కు ముందంతా అదే ప్రచారం జరిగింది.
ఇక పోలింగ్ తర్వాత చంద్రబాబు నాయడు మాట్లాడుతున్న తీరును బట్టి చూసినా ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందనే నమ్మకాలు చాలా మందిలో కలగడం లేదు. 'ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచింది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడింది..' అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న కామెంట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే నమ్మకాలను ఆ పార్టీ వారిలో కూడా తగ్గించి వేస్తున్నాయనే ప్రచారం సాగుతూ ఉంది.
ఏపీలో పరిస్థితి అలా ఉంటే.. ఏకంగా చంద్రబాబు నాయుడు ప్రధాని పదవికి తగిన వ్యక్తి అనే శారట ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఇటీవలే మహారాష్ట్రకు వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ కృతజ్ఞతతోనేనేమో.. దేశానికి ప్రధానిగా చంద్రబాబు అయితే బావుంటుందని పవార్ చెప్పుకొచ్చారట. రాహుల్ ప్రధానిగా వద్దంటూ.. మాయవతి లేదా మమతా బెనర్జీ ప్రధాని కావాలని వారు కాకపోతే చంద్రబాబు ప్రధాని కావాలని పవార్ అన్నారట.
మరి పవార్ కు ఏపీలో సంగతి విషయంలో ఎంత వరకూ అవగాహన ఉందో కానీ.. ఏపీ ప్రజలు చంద్రబాబును సీఎం హోదా నుంచినే దించేయనున్నారనే ప్రచారం జరగుతున్న సమయంలో బాబును ప్రధాని పదవి విషయంలో పవార్ ప్రతిపాదించారనేది మాత్రం ఆశ్చర్యకరంగా మారింది. మరి అసలు కథ ఎలా ఉండబోతోందో మే ఇరవై న కానీ తెలియదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారా, ప్రధాని అవుతారా.. అనేది మే ఇరవై మూడున వచ్చే ఫలితాలతోనే స్పష్టత వస్తుందని వేరే చెప్పనక్కర్లేదు!