Begin typing your search above and press return to search.
అంబానీ ఇంటికి వెళ్లిన ఫైర్ బ్రాండ్ సీఎం
By: Tupaki Desk | 1 Nov 2017 6:57 AM GMTఒకేసారి ఒకటికి పైగా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోవటం ఆరుదు. అలాంటిది ఒకసారి రెండు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవటం.. ఆ రెండు భిన్న కోణాలకు సంబంధించి కావటం ఆసక్తికరంగా మారింది. ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రిగా సుపరిచితురాలు.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా ముంబయికి వచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలంటూ పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించేందుకు ముంబయి వచ్చిన ఆమె.. ప్రముఖ పారిశ్రామికవేత్త.. దేశంలో అత్యంత సంపన్నుడైన రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ఇంటికి వెళ్లటం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంబానీ విలాసవంతమైన నివాసం అంటిల్లాలో ఏర్పాటు చేసిన విందుకు మమతా హాజరయ్యారు. దాదాపు గంటకు పైగా అంబానీ నివాసంలో గడిపిన ఆమె.. విందు పూర్తి అయ్యాక తాను విడిది చేసిన తాజ్ మహల్ ప్యాలెస్ కు వెళ్లిపోయారు. సాదాసీదా జీవితాన్ని గడుపుతానని చెప్పే మమత..విలాసవంతమైన హోటల్లో విడిది చేయటం గమనార్హం.
అంబానీ ఇంటికి వెళ్లిన దీదీ.. పనిలో పనిగా తన ముంబయి టూర్ లో పారిశ్రామికవేత్తలతో పాటు.. రాజకీయ ముఖ్యులతో భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో ప్రధాని మోడీని తన మాదిరే విమర్శలు చేసే శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో సమావేశం కావటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు భిన్నధ్రువాలు కలవటం మామూలు విషయం కాదు కదా?