Begin typing your search above and press return to search.
కథేంటి?: మోడీతో మమతా బెనర్జీ కీలక భేటి?
By: Tupaki Desk | 27 July 2021 12:08 PM GMTబెంగాల్ ఎన్నికల వేళ టామ్ అండ్ జెర్రీలాగా పొట్లాడుకున్న ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు నిప్పులు రాజేశారు. ఎన్నికలు ముగిసినా బెంగాల్ లో బీజేపీ వర్సెస్ తృణమూల్ ఫైట్ కొనసాగుతోంది. రాజకీయంగా ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. పార్లమెంట్ లోనూ బీజేపీని టీఎంసీ ఎంపీలు నిలదీస్తూ కాకరేపుతున్నారు.
ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోడీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటి కావడం సంచలనమైంది. మూడోసారి సీఎంగా మమత అయ్యాక ఆమె తొలిసారి మోడీతో భేటి కావడం గమనార్హం.
ఈ భేటిలో పశ్చిమ బెంగాల్ లో రాజకీయ హింస,కరోనా పరిస్థితులు, పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై వీరిద్దరూ చర్చించే అవకాశం కనిపిస్తోంది. మమత బుధవారం సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా కలుసుకోనున్నారు.
ప్రధానంగా మోడీతో బెంగాల్ కు రావాల్సిన కేంద్రం నిధులు, ఇతర అధికారిక అంశాలపైనే మమతా చర్చించినట్టు సమాచారం. ప్రధానంగా నిధులు, కేంద్రం నుంచి చేయాల్సిన పనుల మీదనే వీరిద్దరి భేటి జరిగినట్లు చెబుతున్నారు.
ఇక అంతకుముందు మమతా బెనర్జీని కాంగ్రెస్ నేతలు కలిశారు. కమల్ నాత్, ఆనంద్ శర్మలు ప్రత్యేకంగా మమతతో భేటి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సాధించిన విజయానికి అభినందనలు తెలిపామన్నారు.
రేపు సోనియాతో మమత భేటి కానున్నారు. మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం, రాజకీయ కూటమిపై వీరిద్దరి మధ్య చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.
కేంద్రంలోనే అధికారంలో ఉన్న మోడీని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా సరే ఓడించాలని ఓవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే అందరు ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారు. ఇప్పుడు పీకేకు తోడుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఈ కీలక భేటిలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు మమత ప్రయత్నాలు మొదలుపెట్టారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో జట్టు కట్టడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో పరిణామాలు చూస్తుంటే అదే చెప్తున్నారు.
నరేంద్రమోడీని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు బద్ధ శత్రువులైన కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ చేతులు కలుపుతున్నట్టే ఉన్నాయి. అందుకే రేపు సోనియాగాంధీ-మమత భేటి జరుగబోతోందని సమాచారం