Begin typing your search above and press return to search.
కీలకమైన ఎన్నికల వేళ.. దీదీ ఇమేజ్ వదిలేసి బేటీ ప్రచారం ఎందుకు?
By: Tupaki Desk | 8 March 2021 1:30 PM GMTనువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది పశ్చిమబెంగాల్ లోని అసెంబ్లీ పోరు. దేశంలోని ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరి చూపు తొలుత పశ్చిమబెంగాల్ వైపు ఉంటే.. తర్వాత తమిళనాడు ఫలితం మీద ఆసక్తిని కనపరుస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేపట్టాలని బీజేపీ భావిస్తుంటే.. మోడీ పరివారానికి బెంగాల్ లో చోటు లేదన్న విషయాన్ని ఎన్నికల ఫలితాలతో చాటి చెప్పాలని మమత బలంగా కోరుకుంటున్నారు. అందుకే.. తన శక్తియుక్తులన్నింటిని సమీకరించుకొన్న ఆమె ఎన్నికల్లో దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే.. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ పోటీకి సిద్ధమా? అంటూ దీదీ చేసిన సవాలు చూస్తే.. దేనికైనా సిద్ధమన్నట్లుగా ఉందని చెప్పాలి.
మమతా బెనర్జీ అన్నంతనే దీదీ అన్న మాట అందరికి గుర్తుకు వస్తుంది. అలాంటి ఇమేజ్ ను ఇప్పుడామె పూర్తిగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఇంతకాలం దీదీ అనిపించుకున్న మమత.. ఇప్పుడు బేటీ అనిపించుకోవటానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఎందుకిలా? అంటే.. అందులోనే ఉంది రాజకీయవ్యూహమంతా అని చెబుతున్నారు. ఎన్నికల వేళ బీజేపీపై పైచేయి సాధించేందుకు బేటీ నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు దీదీ.
దీదీ అంటే అక్క. మన కంటే వయసులో పెద్దదిగా ఉండే వ్యక్తి. మన చేతికి పట్టుకు తీసుకెళ్లే భావన ఆ మాటలో ఉంటుంది. అదే.. బేటీ అయితే.. మనం కాపాడుకోవాల్సిన వ్యక్తి అన్న భావన కలుగుతుంది. బేటీ.. అన్నంతనే.. తన బాధ్యత మనది. తనను మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? అన్న భావన మనసులోకి రానివ్వటంతోనే సగం విజయాన్ని మత సాధించినట్లు అవుతుందంటున్నారు.
బయట నుంచి వచ్చే బీజేపీనుంచి బెంగాలీ బేటీని రక్షించుకోవాలన్న భావోద్వేగాన్ని రగిలించటమే ‘బేటీ’ అసలు ఉద్దేశంగా చెబుతున్నారు. బెంగాలీల్లో అంతర్లీనంగా భావోద్వేగాన్నిరగిలించుకోవటానికి చేస్తున్న తాజా ప్రయత్నంగా దీనని చెప్పాలి. దీనికి తోడు ఇప్పుడు జరుగుతున్నది అసెంబ్లీ పోరు కాబట్టి.. మోడీకేం సంబంధం అన్న విషయాన్ని బెంగాలీలకుగుర్తు చేసేందుకే తనకున్న దీదీ ఇమేజ్ ను వదిలేసి.. బేటీ మాటను మమత పట్టుకున్నారని చెప్పక తప్పదు. మరి..దీదీ కాస్తా బేటీ అయిన వేళ.. బెంగాలీలు ఏమేరకు కనెక్టు అవుతారో చూడాలి.