Begin typing your search above and press return to search.
మోదీ డెబ్బ... అంతా రాజీనామా బాట పట్టారే
By: Tupaki Desk | 26 May 2019 4:13 AM GMTసార్వత్రిక ఎన్నికల్లో ప్రదాని నరేంద్ర మోదీని మరోమారు అధికారంలోకి రాకుండా చేయాలన్నదే లక్ష్యంగా కదిలిన పార్టీలన్నీ... ప్రజలిచ్చిన తీర్పుతో షాక్ తిన్నాయి. మోదీని నిలువరించడం కాదు కదా... తాము నిలిచే పరిస్థితి కనిపించకపోవడంతో ఆ పార్టీలన్నీ దెబ్బకు డోర్లు బిగించుకుని కూర్చున్నాయి. రాజకీయాలన్నాక గెలుపు - ఓటములు సహజమే కదా. అయితే విజయం దక్కినప్పుడు ఎగిరెగిరి పడటం, పరాజయం పలకరించగానే డోర్లు బిగించుకుని కూర్చునే నేతలు ఇప్పుడు బాగానే పెరుగుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో మోదీ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ...ఏకంగా తన పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. అయితే సోనియమ్మ ఆపడంతో ఆయన కాస్త వెనక్కు తగ్గారు గానీ... త్వరలోనే ఆయన ఏఐసీపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అంతగా చక్రం తిప్పడం రాని రాహుల్ గాంధీ పరిస్థితి ఇలా ఉంటే... పశ్చిమ బెంగాల్ తో పాటు జాతీయ స్థాయిలోనూ బాగానే చక్రం తిప్పుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రాజీనామాకు సిద్దపడ్డారన్న వార్తలు నిజంగానే కలకలం రేపుతున్నాయి.
బీజేపీకి ఎదురెళ్లిన వాళ్లలో దీదీనే ముందుంటారని చెప్పక తప్పదు. తన పాలనలోని బెంగాల్ లో బీజేపీని అడుగుపెట్టనీయకుండా... అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన దీదీ... మొన్నామధ్య సీబీఐ అధికారులను రౌండప్ చేసి సంచలనం సృష్టించారు. అంతేనా... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కూడా కోల్ కతాలో కాలు పెట్టకుండా అడ్డుకున్నారు. వీటన్నింటినీ మోదీ గుర్తు పెట్టుకునే ఉంటారు కదా. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో వరుసగా రెండో పర్యాయం క్లియర్ మెజారిటీతో అధికారం చేపట్టిన తర్వాత మోదీ ఊరుకుంటారా? అన్న భయం కలిగిందో, ఏమో తెలియదు గానీ... పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని దీదీ ప్రతిపాదించారట. అయితే రాజీనామా విషయంలో రాహుల్ ను అడ్డుకున్నట్లుగానే దీదీని కూడా తృణమూల్ శ్రేణులు అడ్డుకున్నాయట.