Begin typing your search above and press return to search.
కరోనా కట్టడిలో సీఎం ఫెయిల్..గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 15 April 2020 12:27 PM GMTదేశంలో కరోనా వైరస్ ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 12 వేలకి చేరువలో ఉంది. అలాగే కరోనా కారణంగా ఇప్పటివరకు 392 మంది చనిపోయారు. అయితే , దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను అడ్డుకోవడానికి లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. తొలిదశ లాక్ డౌన్ గడువు ముగియడంతో ..తాజాగా మరోసారి మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగించారు.
అయితే , కరోనాను అరికట్టాలని ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా కరోనా కేసులు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నమోదౌతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ - మహారాష్ట్ర - తమిళనాడు - తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలలో కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ప్రపంచం మొత్తం కరోనాతో భయంతో వణికిపోతుంటే ..పచ్చిమ బెంగాల్ లో మాత్రం లాక్ డౌన్ ను సరిగ్గా అమలు చేయడం లేదు. దీనితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజులుగా గవర్నర్ జగదీప్ సింగ్ - సీఎం మమత మధ్య వార్ నడుస్తుంది. గవర్నర్ మాటని సీఎం మమత ఏ మాత్రం లెక్కచేయడంలేదు.
అలాగే , రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులని - రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తక్కువ చేసి చూపిస్తుందని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో గవర్నర్ జగదీప్ సింగ్ సీఎం మమతపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో ఈయన వ్యాఖ్యలకి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కరోనా కట్టడిలో సీఎం మమత ప్రభుత్వం తీవ్రస్థాయిలో విఫలమైందని.. ప్రజలు గుంపులుగా ఉండకుండా చేయడంలో, మత సమావేశాలు జరపకుండా అరికట్టడంలో సీఎం మమత విఫలమైందని గవర్నర్ ఆరోపించారు. దీనితో వెంటనే కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని ఆయన వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా ఇప్పుడు అయన వ్యాఖ్యలు పెను దుమారం రేవుతున్నాయి.