Begin typing your search above and press return to search.

బెంగాలీల భావోద్వేగాన్ని పెంచేలా దీదీ కొత్త ప్లాన్!

By:  Tupaki Desk   |   16 May 2019 5:32 AM GMT
బెంగాలీల భావోద్వేగాన్ని పెంచేలా దీదీ కొత్త ప్లాన్!
X
మొండోడు రాజు కంటే బ‌ల‌మైనోడంటారు. మ‌రి.. రాజే మొండి అయితే ఇంకేంట‌న్న‌ది చూశాం. తాజాగా బెంగాల్ లో మోడీ వ‌ర్సెస్ దీదీ వ్య‌వ‌హారం చూస్తే.. మొండి.. జ‌గ‌మొండి ఇద్ద‌రి మ‌ధ్య పోరు షురూ అయితే ఎలా ఉంటుంద‌న్న ఇట్టే అర్థం కాక మాన‌దు. బెంగాల్ లో పాగా వేయ‌టం అంటే మామూలు విష‌యం కాదు. ఇప్పుడు తిరుగులేని నేత‌గా క‌నిపిస్తున్న ఫైర్ బ్రాండ్ మ‌మ‌త ఈ స్థానానికి చేరుకోవ‌టానికి ప‌డిన క‌ష్టం అంతా ఇంతా కాదు.

ఇప్పుడు ఎలా అయితే అమిత్ షాను వ్య‌తిరేకించారో.. అంతే వ్య‌తిరేక‌త ఒక‌ప్పుడు మ‌మ‌త చేసే ర్యాలీల మీదా.. స‌భ‌ల మీదా ఉండేది. అలాంటిప్ర‌తికూల ప‌రిస్థితిని ఎదుర్కొన్న దీదీ.. ఈ రోజు తిరుగులేని శ‌క్తిగా మారారు. రోడ్డు మీద పోరాటాలు చేసే స్థాయి నుంచి ప‌వ‌ర్ స్టేష‌న్ గా మారిపోయిన మ‌మ‌త‌కు ఎప్పుడేం చేయాలి.. ఏ విష‌యాన్ని ఎలా ఎదుర్కోవాల‌న్న విష‌యంలో ఉండే క్లారిటీ అంతా ఇంతా కాదు.

దేశం మొత్త‌మ్మీదా తాను టార్గెట్ చేసిన వారికి చుక్క‌లు చూపించే మోడీషాలకు సైతం ఒక ప‌ట్టాన కొరుకుడుప‌డ‌ని రీతిలో ఉన్న దీదీపై ముఖాముఖి పోరుకు అమిత్ షా సై అన‌టం తెలిసిందే. బెంగాల్ లో ప‌ర్య‌టించేందుకు వెళ్లిన ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురుకావ‌ట‌మే కాదు.. నా ప్రాణాలు పోయేవి అన్న మాట ఆయ‌న నోటి నుంచి రావ‌టంలో మెలోడ్రామా ఉన్న‌ప్ప‌టికి.. అంత పెద్ద మాటను ఆయ‌న వాడిన తీరు చూస్తే.. బెంగాల్ విష‌యంలో వారెంత ప‌ట్టుద‌ల‌తో ఉన్నారో తెలుస్తుంది.

ప‌ట్టు లేని మోడీ బ్యాచ్ కే అంత ఉంటే.. ప‌వ‌ర్లో ఉన్న త‌న‌కు మ‌రెంత ఉండాల‌న్న‌ట్లుగా మ‌మ‌త తీరు ఉంది. అందుకే.. మోడీషాలకు ఛాన్స్ ఇవ్వ‌కుండా వారిని ఉక్కిరిబిక్కిరి చేసే ప‌నుల్ని షురూ చేశారు దీదీ. అమిత్ షా ఎన్నిక‌ల ర్యాలీలో చెల‌రేగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో బెంగాల్ సంఘ సంస్క‌ర్త ఈశ్వ‌ర చంద్ర విద్యాసాగ‌ర్ విగ్ర‌హం ధ్వంసం కావ‌టం. .దాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా.. తృణ‌మూల్ నేత‌లు త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌కు ఆయ‌న ఫోటోల్ని ప్రొఫైల్ పిక్ గా మార్చుకొని నిర‌స‌న‌కు తెర తీశారు.

త‌న‌పై చేస్తున్న దాడిని బెంగాలీల‌పై చేస్తున్న దాడిగా మార్చే విష‌యంలో దీదీ వేసిన వ్యూహం వ‌ర్క్ వుట్ అయ్యే అవ‌కాశం ఉందంటున్నారు. బెంగాలీల‌ను భావోద్వేగంతో క‌నెక్ట్ అయ్యేలా చేస్తున్న మ‌మ‌తకు చెక్ పెట్టేందుకు మోడీషాలు మ‌రిన్ని నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికి వెనుకాడ‌రంటున్నారు. అదే జ‌రిగితే.. రాజ‌కీయ అగ్నికి బెంగాల్ బ‌లి కాక మాన‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. షా ర్యాలీ ఘ‌ర్ష‌ణ‌గా మారి.. ఈ రోజున ఆ రాష్ట్రంలో వాతావ‌ర‌ణం ఎంత టెన్ష‌న్ గా మారిందో తెలిసిందే. మ‌రీ.. ఉద్రిక్త‌త‌లు ఎన్నిక‌ల పోలింగ్ తో ఆగుతాయా? మ‌రింత‌గా విస్త‌రిస్తాయా? అన్న‌ది కాల‌మే స‌మాధానం ఇవ్వాలి.