Begin typing your search above and press return to search.
తారల్ని నమ్ముకున్న దీదీ..గ్లామర్ కు టికెట్ల నజరానా!
By: Tupaki Desk | 13 March 2019 5:07 AM GMTరాజకీయాలకు సినిమా ఇండస్ట్రీకి మధ్యనున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అనుబంధం దక్షిణాదిన ఎక్కువే. ఈ విషయాన్ని గుర్తించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి గడిచిన కొన్నేళ్లుగా అవసరానికి తగ్గట్లుగా సినీ గ్లామర్ కు టికెట్లు ఇచ్చేస్తున్న వైనం తెలిసిందే. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ దీదీ ఇదే ఫార్ములాను నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మొత్తం 42 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీలైనన్ని ఎక్కువ స్థానాల్ని సొంతం చేసుకోవటం ద్వారా ప్రధాని మోడీకి చెక్ చెప్పాలన్న యోచనలో దీదీ ఉన్నారు. తన అడ్డాలో బీజేపీకి కనీస సీట్లు కూడా రాకూడదన్న పట్టుదలతో ఉన్న ఆమె.. మొత్తం 42 స్థానాలకు ఐదు స్థానాల్ని సినీ తారలకు కేటాయించటం గమనార్హం. పార్టీలోనూ.. ఎన్నికల బరిలోనూ తారల తళుకుబెళుకులకు ఏ మాత్రం లోటు లేని రీతిలో ఆమె టికెట్లు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
బెంగాల్ లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సినీ తారలకు టికెట్లను కేటాయిస్తున్న దీదీ.. తాజాగా అదే బాటలో పయనించారు. తాజాగా ప్రకటించిన జాబితాలో ఐదుగురు సినీ తారలకు టికెట్లు దక్కాయి. దీదీ పార్టీ విడుదల చేసిన జాబితాలో టికెట్లు దక్కించుకున్న సినీ తారల విషయానికి వస్తే..
1. నుస్రాత్ జహాన్(బసీరాత్)
2. మిమి చక్రవర్తి(జాదవ్ పూర్)
3. శతాబ్ది రాయ్(బిర్భూమ్)
4. మూన్ మూన్ సేన్(అసాన్ సోల్)
5. దేవ్(ఘటల్)