Begin typing your search above and press return to search.
ప్రశాంతంగా చనిపోవచ్చన్న సీఎం
By: Tupaki Desk | 1 Sep 2016 5:32 AM GMTఉద్యమ నేపథ్యంతో రాజకీయాల్లో పైకొచ్చిన వారి తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. రెగ్యులర్ రాజకీయ నాయకులతో పోలిస్తే.. వీరిలో భావోద్వేగం ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో.. నియంతృత్వ తరహా ధోరణి కూడా కనిపిస్తుంది. వ్యవస్థల్ని ధిక్కరించి తమ డిమాండ్లను సాధించుకున్నధైర్యమో.. ఆత్మవిశ్వాసమో కానీ వీరి తీరు.. మిగిలిన వారితో పోలిస్తే భిన్నంగా ఉంటుందని చెప్పటంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. ఇందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కావొచ్చు.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లు కావొచ్చు. కొన్ని విషయాల్లో ఇద్దరు తీరు ఒకేలా ఉండటం కనిపిస్తుంది.
కమ్యూనిస్టులపైన అలుపెరగని పోరాటం చేసి.. దశాబ్దాల తరబడి వారి చేతుల్లో పోగుపడిన అధికారాన్ని తన సొంతం చేసుకున్న మమతా.. కామ్రేడ్స్ హయాంలో తీసుకున్న వివాదాస్పద సింగూర్ భూసేకరణపై తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పుపై దీదీ సంతోషాన్నివ్యక్తం చేశారు. సింగూర్ ఉదంతంలో తన సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందని వ్యాఖ్యానించారు.
లెఫ్ట్ పార్టీ సర్కారు ఉన్న వేళ.. టాటాకు సింగూర్ భూముల్ని అప్పగించిన తీరు అప్పట్లో వివాదాస్పదం కావటమే కాదు.. పెద్ద రచ్చకు దారి తీసింది. ఒకవిధంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ కోట బీటలు వారేలా చేయటంలో సింగూర్ ఇష్యూ కూడా కారణంగా చెప్పేవారున్నారు. రైతుల నుంచి సేకరించిన భూమిని రైతులకు తిరిగి ఇచ్చేయాలంటూ సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో.. నాలుగు నెలల వ్యవధిలో రైతులకు భూమి వాపసు చేయనున్నట్లు వెల్లడించారు. సుప్రీం తీర్పు పుణ్యమా అని ఈ వ్యవహారంపై పోరాడుతున్న దీదీ ఫుల్ హ్యాపీ కావటం ఖాయం.
దీనికి తగ్గట్లే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ‘‘ఈ చారిత్రక విజయం నాకెంతో సంతోషానిచ్చింది. ఇది ప్రజా విజయం. నేనిక ప్రశాంతంగా చనిపోవచ్చు’’ అంటూ వ్యాఖ్యానించారు. తాను సాధించాలని పట్టుబట్టిన అతి కొద్ది అంశాల్లో సింగూర్ రైతులకు వారి భూముల్ని తిరిగి ఇచ్చేయటంగా చెప్పొచ్చు. తాజాగా ఆ అవకాశం తనకు లభించటం పట్ల మమత ఎంత హ్యాపీగా ఉన్నారన్న విషయం ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. తాను సాధించాలనుకున్నది సాధించిన సమయంలో తానిక ప్రశాంతంగా మరణించొచ్చన్నమాటతో సింగూర్ రైతుల విషయంలో దీదీ తనకున్నకమిట్ మెంట్ ను తన మాటలతో మరోసారి రుజువైందని చెప్పక తప్పదు.