Begin typing your search above and press return to search.
వేర్పాటు ఉద్యమాలను సహించేది లేదంటున్న సీఎం
By: Tupaki Desk | 30 Jun 2017 5:55 AM GMTగత కొంతకాలంగా బెంగాల్ నుంచి విడిపోవాలనే డిమాండ్ - ప్రత్యేక గూర్ఖాలాండ్ కోరుతూ డార్జిలింగ్ హిల్స్ లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టత ఇచ్చారు. ‘బెంగాల్ విడిపోదు. అందుకు నేను ఒప్పుకోను’ అని స్పష్టం చేశారు. బుర్ద్వాన్ లోని ఓ బహిరంగ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ విభజనకు తాను ఒప్పుకునేదే లేదని ఆమె తేల్చిచెప్పారు. ఆందోళనలు కేవలం కుట్రపూరితం మాత్రమేనని, దాన్ని మేం ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. వేరే దేశం, ఈశాన్య రాష్ట్రాల నుంచి అక్రమంగా చొరబడ్డ వ్యక్తులే గూర్ఖా జన్ ముక్తి మోర్చాను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని మమత ఆరోపించారు. ఇలాంటి కుట్రలపై తాము పోరాడుతామని మమతాబెనర్జీ తెలిపారు.
జూన్ 9న డార్జిలింగ్ లో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో బెంగాలీ భాష బోధనను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. దీంతో గూర్ఖాలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని రెండు వారాల క్రితం గూర్ఖా జనముక్తి మోర్చా చేపట్టిన ఆందోళనలు, నిరసన దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో వంక డార్జిలింగ్ నుంచి సైనిక దళాలను ఉపసంహరించుకుంటున్నట్లు తూర్పు ఆర్మీ కమాండర్ ప్రకటించారు. పౌర అధికార యంత్రాంగానికి మద్దతుగా సైనిక దళాలను ఇంకెంతమాత్రం వినియోగించలేమని ఆయన ప్రకటించారు. అయితే పారామిలటరీ దళాలు డార్జిలింగ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ గస్తీ కొనసాగిస్తున్నాయి. కొద్ది పాటి నిరసన ర్యాలీలను అదుపు చేసేందుకు, కీలక ప్రాంతాల్లో మోహరించాయి.
మరో వంక డార్జిలింగ్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత కొనసాగుతూనే ఉంది. హింసను ప్రేరేపించే సమాచారం వ్యాపించకుండా జూన్ 30 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపి వేస్తామని డార్జిలింగ్ డిఎం జోయిశ్రీ దేశ్‌గుప్తా తెలిపారు. నెట్ సేవలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల అడ్మిషన్ ఫారాలు నింపడంపై కూడా ప్రభావం చూపుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/