Begin typing your search above and press return to search.
హత్రాస్ ఘటన: యూపీ సర్కార్ వైఖరికి నిరసనగా సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ!
By: Tupaki Desk | 3 Oct 2020 4:00 PM GMTహాథ్రాస్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసననలు హోరెత్తుతున్నాయి. ఈ ఘటన పట్ల ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, బీజేపీ ప్రభుత్వం మాత్రం ఈ ఘటనపై ప్రత్యేక బృందం దర్యాప్తు ముగిసే వరకు ఎలాంటి నిరసనలకు అనుమతి ఉండబోదని స్పష్టం చేసింది. ఈ తరుణంలో యూపీ సర్కార్ వైఖరిని ఖండిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యాన శనివారం కోల్ కతా లో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నారు.
ఈ పార్టీకి చెందిన నలుగురు నేతల ప్రతినిధి బృందాన్ని యూపీ పోలీసులు హత్రాస్ సరిహద్దుల్లో నిన్న అడ్డగించారు. వీరికి, టీఎంసీ నాయకులకు మధ్య జరిగిన తోపులాటలో ఈ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ కిందపడిపోయి స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనను మమతా బెనర్జీ తీవ్రంగా పరిగణించారు. బాధితురాలి కుటంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తమ పార్టీ నేతలపట్ల యూపీ పోలీసుల దుశ్చర్యను ఆమె ఖండిస్తూ, ఆ రాష్ట్ర సర్కార్ పై పలు విమర్శలు చేశారు.