Begin typing your search above and press return to search.
మోడీని దెబ్బ తీసే దీదీ ప్లానింగ్ లో పస మిస్ అయ్యింది సామి
By: Tupaki Desk | 22 Feb 2021 9:16 AM GMTఅంతకంతకూ పెరుగుతూ వెళుతున్న పెట్రోల్.. డీజిల్ ధరలు.. ఎక్కడికి వెళ్లి ఆగుతాయన్నది ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. మరో..మూడు తర్వాత లీటరు పెట్రోల్ వంద రూపాయిలు దాటేస్తుందని భావిస్తే.. అది కాస్తా ఈ నెలాఖరుకు పూర్తి చేసే జోరులో ఉన్నాయి కేంద్ర చమురు సంస్థలు. తమను తిట్టిపోయటం కాకుండా కేంద్రం పాలసీని మారిస్తే తప్పించి ధరల భారం తగ్గదంటున్నారు. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న వైనంపై సామాన్యుల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతున్నప్పటికీ.. దానికిచూపించే సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పెట్రోల్.. డీజిల్ పై పెరుగుతున్న ధరలకు చెక్ పెట్టేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక ప్లాన్ వేశారు. తాజాగా లీటరు పెట్రోల్.. డీజిల్ పైన రూపాయి చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన ఎన్నికలు విరుచుకుపడుతున్న వేళలో.. పెరుగుతున్న ఇంధన ధరలకు చెక్ పెట్టటమే కాదు.. దీనంతటికి మూలం కేంద్రమే అన్న విషయాన్ని తెలివిగా ప్రచారంలోకి తెచ్చిన వైనం అదిరేలా ఉంది.
అయితే.. ఈ ప్రచారం బాగానే ఉన్నా.. రాష్ట్రం తన వాటా కింద వచ్చే ఆదాయంలో కేవలం రూపాయి వదులుకోవటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు. దీని కంటే కూడా.. మరింత మొత్తాన్ని తగ్గిస్తే మంచిదన్న భావన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న పెట్రోల్.. డీజిల్ ధరలపై మమత సర్కారు స్పందిస్తూ.. కేంద్రం పెట్రోల్ పైపన్నులరూపంలో లీటరుకు రూ.32.9 తీసుకుంటున్న విషయాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. అంతేకాదు.. కేంద్రం వసూలు చేసే పన్ను మొత్తంలో రాష్ట్రానికి లభిస్తున్న మొత్తాన్ని పేర్కొన్నారు.
రాష్ట్రాలకు లీటరుకు కేవలం రూ.18.46 మాత్రమే వస్తున్నాయని.. డీజిల్ మీద కేంద్రానికి లీటరుకు రూ.31.80 కాగా రాష్ట్రాలకు ఇచ్చేది మాత్రం రూ.12.77 ఇస్తారని పేర్కొన్నారు. ధరల తగ్గింపు నిర్ణయం మోదీ పరివారానికి దిమ్మ తిరిగేలా షాకివ్వాలన్నా.. కేంద్రం ఆత్మరక్షణలో పడాలన్నా.. ధరాభారాన్ని దీదీ మరికాస్త భరిస్తేనే ప్రయోజనం. లేకుంటే.. రూపాయి తగ్గింపుతో ఎలాంటి యూజ్ ఉండదంటున్నారు. మరి.. దీదీ ఏం చేస్తారో చూడాలి.