Begin typing your search above and press return to search.

బడ్జెట్ సెగ..మోడీకి మొదలైందిగా..!

By:  Tupaki Desk   |   2 Feb 2020 9:57 AM GMT
బడ్జెట్ సెగ..మోడీకి మొదలైందిగా..!
X
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మంటలు అంటుకున్నాయి. ఎయిర్ ఇండియా - రైల్వే నుంచి ఇప్పుడు ఎల్ ఐసీ బీమా సంస్థను కూడా కేంద్రం అమ్మకానికి పెట్టడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు దీనిపై పోరుబాటకు రెడీ అయ్యాయి.

ఎల్ఐసీ బచావో నినాదంతో ప్రతిపక్ష పార్టీలన్నీ పోరాడేందుకు నిర్ణయించారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంలోని మోడీ సర్కారుపై పోరాటానికి శ్రీకారం చుట్టారు.

ఎయిర్ ఇండియాలో 100శాతం తన వాటాను విక్రయించడానికి కేంద్రం సిద్ధమైంది. ఇక ప్రైవేటు రైళ్లకు అనుమతులు ఇచ్చేసింది. ఇక భారత్ పెట్రోలియం - షిప్పింగ్ కార్పొరేషన్ లలో పెట్టుబడులను ఆహ్వానించింది. ఇక ఈ బడ్జెట్ లో తాజాగా ఎల్ ఐసీ - ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లను అమ్మడానికి సిద్ధమవ్వడంపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.

నరేంద్ర మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా అమ్మకానికి పెట్టడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఎల్ ఐసీ వాటాలను విక్రయించడం దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. కోట్లాది మంది మధ్యతరగతి ప్రజలు తమ సొమ్మును ఎల్ ఐసీలో పెట్టారని.. అలాంటి సంస్థను ప్రైవేటుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. పేదల సొమ్ముకు భద్రత ఉండదని దీనిపై దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడుతామని మమతా బెనర్జీ కేంద్రాన్ని హెచ్చరించారు.