Begin typing your search above and press return to search.
మోదీని తన చీర చూడమంటున్న మహిళా సీఎం!
By: Tupaki Desk | 17 Dec 2019 1:07 PM GMTఔను. మీరు చదివింది కరెక్టే. అమె చెప్పింది నిజమే. అన్వయించు కోవడంలోనే అసలు సమస్య. అలా కామెంట్ చేసింది దేశంలోని ఏకైక మహిళ ముఖ్యమంత్రి అయిన ఫైర్ బ్రాండ్ నేత మమతాబెనర్జీ. టార్గెట్ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీని. పౌరసత్వ సవరణ చట్టంపై మండిపడుతున్న మమతాబెనర్జీ తాజాగా ప్రధానిని చిత్రంగా టార్గెట్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు చేపడుతున్న వారిని వాళ్లు వేసుకున్న దుస్తుల ద్వారా గుర్తుపట్టవచ్చు అని ప్రధాని మోదీ ఇటీవల కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. తాను కట్టుకున్న చీరు చూసి, తాను మంచో చెడో అన్న కామెంట్ ను ఎవరైనా చేయగలరా అని దీదీ ప్రశ్నించారు. డ్రెస్ కోడ్ ఆధారంగా ఓ వ్యక్తిని గుర్తించడం ఆమోదించదగ్గ విషయం కాదు అని మమతా అన్నారు.
జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) - పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా సోమవారం ఆమె నేతృతంలో కోల్ కతాలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దానికి కొనసాగింపుగా వరుసగా రెండో రోజు కోల్ కతాలో ధర్నా చేపట్టారు. సినీ తారలు - తృణమూల్ ఎంపీలు ఆ ర్యాలీలో పాల్గొన్నారు. తనను జైల్లో పెట్టినా సరే లొంగేది లేదని - కావాలంటే తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవచ్చని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రానికి సవాల్ విసిరారు. సమావేశానికి వచ్చిన భారీ జనసమూహాన్ని ప్రశ్నిస్తూ - దుస్తుల ఆధారంగా ఎవరినైనా గుర్తుపట్టడం వీలవుతుందాని ఆమె అడిగారు. కేవలం డ్రెస్ కోడ్ ఆధారంగా ఒకర్ని మంచిగా, మరొకర్ని చెడుగా చూడలేమన్నారు. నేను కట్టుకున్న చీరు చూసి - నేను మంచో చెడో అన్న కామెంట్ ను ఎవరైనా చేయగలరా అని దీదీ ప్రశ్నించారు. ఎవరైనా నెత్తికి టోపీ పెట్టుకుంటే వారిని ఆ టోపీ ద్వారానే గుర్తిస్తారా అని అడిగారు. ఇది వీళ్ల డ్రెస్సు - అది వాళ్ల డ్రెస్సు - ఇది వీళ్ల తిండి - అది వాళ్లది.. ఇలాంటివి ఎప్పుడు మన దేశంలోకి చొరబడ్డాయని ఆమె నిలదీశారు. పంజాబీలు నెత్తికి తలపాగా కట్టుకుంటారని - క్రైస్తవ పూజారాలకు ప్రత్యేక డ్రెస్సు కోడ్ లో ఉంటారన్నారు. వారందర్నీ డ్రెస్సు కోడ్ - ఆహార అలవాట్ల ద్వారా గుర్తుపట్టాలా అని దీదీ ప్రశ్నించారు. మీరు వేసుకున్న శాలువా కూడా కాషాయం రంగులో ఉండాలని ఎవరైనా అడిగినా అడగవచ్చు అని, ఇదేనా మనకు కావాల్సిందని ఆమె తెలిపారు.
ఎన్నార్సీపై గళమెత్తినప్పుడు తాము ఒంటరిగా ఉన్నామని పేర్కొన్న మమత ఇప్పుడు ఢిల్లీ - బీహార్ - మధ్యప్రదేశ్ - పంజాబ్ - ఛత్తీస్ గఢ్ - కేరళ వంటి ఇతర రాష్ర్టాల సీఎంలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని మమత చెప్పారు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులపై పోలీసుల దాడిని మమత ఖండించారు. తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.