Begin typing your search above and press return to search.
మమత నోట.. ఫెడరల్ ఫ్రంట్ మాట!
By: Tupaki Desk | 20 April 2019 2:38 PM GMTఒకవైపు ఫెడరల్ ఫ్రంట్ అనేది మిథ్య అని, అది కేసీఆర్ భ్రమ అని కొంతమంది అంటున్నారు. ఈ విషయం గురించి చంద్రబాబు నాయుడు చాలా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతు లేనిది కేంద్రంలో ఏ ప్రభుత్వమూ నిలబడదని బాబు అంటూ ఉంటారు. అయితే బాబు తను ఎక్కడ ఉంటే అదే అసలైన రాజకీయ కూటమని చెబుతూ ఉంటారు. గతంలో మూడో ఫ్రంట్ అంటూ బాబే హడావుడి చేశారు. అయితే కేసీఆర్ ఇప్పుడు అలాంటి హడావుడి చేస్తుంటే బాబు తప్పు పడుతూ ఉన్నారు.
ఆ సంగతలా ఉంటే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి పొలిటికల్ దోస్తు మమతా బెనర్జీ ఒక ఆసక్తిదాయకమైన ప్రకటన చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. ‘ప్రధానమంత్రిగా ఎవరుండాలి అనేది ఫెడరల్ ఫ్రంట్ డిసైడ్ చేస్తుంది..’ అని ఆమె ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
ఇలా కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ మాట మమత నోట వెంట వచ్చింది. ప్రస్తుతం కేంద్రంలో కూటముల గందరగోళమే నెలకొంది. జేడీఎస్ - తెలుగుదేశం వంటి పార్టీలు కాంగ్రెస్ వెంట తిరుగుతూ ఉన్నాయి. కొన్ని పార్టీలు బీజేపీతో ఉన్నాయి. మరి కొన్ని తటస్థంగా ఉన్నాయి - తటస్థంగా ఉన్నట్టుగా ప్రకటించుకున్న పార్టీలు టీఆర్ ఎస్ - బీజేడీ - వైఎస్సార్సీపీలు.
ఇక కమ్యూనిస్టులు - బీఎస్పీ-ఎస్పీ - టీఎంసీ పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో గట్టిగా పోరాడుతున్నాయి. జాతీయ స్థాయిలో మాత్రం మితృత్వం అని ప్రకటించుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎవరు ఎటు వెళ్తారనేది ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తెలియదు.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు మమత ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు. తనతో కేసీఆర్, అఖిలేష్, మాయావతి అంతా టచ్లో ఉన్నారని ఆమె చెబుతున్నారు. తామంతా కలిసి ప్రధానిగా ఎవరుండాలో డిసైడ్ చేస్తామంటున్నారామె!