Begin typing your search above and press return to search.

దీదీపై అక్క‌సు తీర్చుకున్న కేంద్ర‌మంత్రి!

By:  Tupaki Desk   |   9 Feb 2019 5:22 AM GMT
దీదీపై అక్క‌సు తీర్చుకున్న కేంద్ర‌మంత్రి!
X
మోడీ అంటే మాట‌లా? ఎలాంటోడైనా స‌రే వ‌ణికిపోవాల్సిందే. వంగి నిల‌బ‌డాల్సిందే. మోకాళ్ల మీద నిలుచోమంటే మారు మాట్లాడ‌కూడ‌దు. అలాంటి హ‌వా న‌డుస్తున్న వేళ‌.. ఒక మ‌హిళ ఆయ‌న తీరును ప్ర‌శ్నించ‌టం.. కౌంట‌ర్ ఇవ్వ‌టం.. సై అంటే సై అన‌టం.. షాకులు ఇవ్వ‌టం లాంటివి చేస్తే క‌మ‌ల‌నాథుల‌కు కోపం రాకుండా ఉంటుందా? చేతిలో ఉన్న ఈడీ.. సీబీఐల‌తో ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి బెడ్రూంలోకి సైతం పంపించే స‌త్తా ఉన్న మోడీ స‌ర్కారుకు కొరుకుడుప‌డ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రించ‌టం అంద‌రికి సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు.

మోడీ లాంటి కొర‌క‌రాని కొయ్యికి స‌వాలు విస‌ర‌ట‌మే కాదు.. త‌న తీరుతో దిమ్మ తిరిగిపోయేలా చేసిన దీదీ అంటే చాలు బీజేపీ నేత‌ల‌కు ఒళ్లు మండిపోతోంది. ఇదిలా ఉంటే.. త‌మ అధినేత్రిని విప‌రీతంగా పొగిడేసి త‌మ విధేయ‌త‌ను చాటే తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ దినేశ్ త్రివేది చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. నేతి ఝూన్సీ రాణి అంటూ లోక్ స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌కు కేంద్ర‌మంత్రి గిరిరాజ్ సింగ్ కు కాలిపోయింది.

తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ పొగ‌డ్త‌కు ఆయ‌న ఘాటు చుర‌క‌వేశారు. దీదీని అలా పోల్చ‌ట‌మంటే ఝూన్సీ రాణిని కించ‌ప‌ర్చిన‌ట్లే. ప‌శ్చిమ‌బెంగాల్ ను మ‌మ‌తా నాశ‌నం చేస్తున్నారు. త‌న గురించి వ్య‌తిరేకంగా మాట్లాడిన వారిని శిక్షించే కిమ్ జోంగ్ ఉన్ లా ఆమె మారారు. ఝూన్సీ రాణి.. ప‌ద్మావ‌త్ లాంటి గొప్ప మ‌హిళ అయ్యేంత సామ‌ర్థ్యం మ‌మ‌త‌కు లేద‌న్నారు.

ఝూన్సీ దేశాన్ని ర‌క్షించ‌టం కోసం పోరాడార‌ని.. కానీ మ‌మ‌త మాత్రం దేశాన్ని విభ‌జించేలా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా చెప్పారు. ఆమె రోహింగ్యా చొర‌బాటుదారుల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని.. మ‌రోవైపు దేశ స‌మ‌గ్ర‌త గురించి మాట్లాడుతున్న‌ట్లుగా మండిప‌డ్డారు.

ప‌శ్చిమ‌బెంగాల్ లో కూడా ఝూన్సీ రాణి ఉన్నార‌ని.. ఆమే మ‌మ‌త అన‌ట‌మే కాదు.. ప్రాణాలు పోయినా మోకాళ్ల మీద నిల‌బ‌డ‌బోమ‌ని మ‌మ‌త చెప్పిన‌ట్లుగా స‌ద‌రు ఎంపీ వెల్ల‌డించారు. త‌మ స‌ర్కారు మీద క‌త్తి క‌ట్టిన మోడీ స‌ర్కార్ ఈడీ.. సీబీఐల‌తో దాడులు చేస్తుంద‌న్నారు. బెంగాల్ ను ర‌క్షించ‌టానికి మ‌మ‌త ఉన్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించారు. తృణ‌మూల్ ఎంపీ వ్యాఖ్య‌ల‌కు కేంద్ర‌మంత్రి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బీజేపీ.. తృణ‌మూల్ నేత‌ల మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల యుద్ధం రానున్న రోజుల్లో మ‌రింత ముద‌ర‌టం ఖాయంగా చెబుతున్నారు.