Begin typing your search above and press return to search.
Mla కాకున్నా నేడు మమత బెనర్జీ ప్రమాణ స్వీకారం
By: Tupaki Desk | 5 May 2021 4:40 AM GMTపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా నేడు మమత బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోవిడ్ కారణంగా రాజ్ భవన్ లో అతికొద్ది మంది సమక్షంలో ఉదయం 10.45 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది.
ఇతర రాష్ట్రాల సీఎంలకు, ముఖ్య నేతలకు ఆహ్వానం అందలేదు. కేవలం తన పార్టీ సన్నిహితులు, ఇతర నేతలను మాత్రమే మమత ఆహ్వానించారు. కోవిడ్ కారణంగా ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లోని 294 అసెంబ్లీ స్థానాలకు 292 స్థానాల్లో పోలింగ్ జరిగింది. మమత పార్టీ టీఎంసీకి 213 సీట్లు, బీజేపీకి 77, ఇతరులకు 2 సీట్లు దక్కాయి. మమత నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయితే ఓడిపోయినా కూడా సీఎం కావచ్చు. కానీ ఆరు నెలల వరకు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. బెంగాల్ లో రెండు అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఒకదాంట్లో పోటీచేసి మమత గెలవడానికి యోచిస్తోంది.