Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు దీదీ ఇచ్చిన తాజా షాక్ ఇదే
By: Tupaki Desk | 21 March 2018 5:03 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కలలకు ఆదిలోనే బ్రేక్ పడింది. తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు - పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ రూపంలో ఈ షాక్ తగలనుంది. అభివృద్ధిలో దేశ దశ దిశలను మార్చేవిధంగా ప్రత్యామ్నాయ ప్రణాళిక - ప్రత్యేక ఎజెండాకోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న చొరవకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ శ్రుతి కలిపారని - కోల్ కతా సచివాలయంలో సోమవారం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య దాదాపు రెండుగంటలపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పడ్డ సంతోషానికి ఆదిలోనే బ్రేక్ పడింది. కేసీఆర్ ను కలిసిన మరుసటి రోజే మమత కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్‌సీపీ అధినేత శరద పవార్ వచ్చేవారం ఏర్పాటు చేసిన ప్రతిపక్ష నేతల సమావేశంలో పాల్గొననున్నారు.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును సాధించే లక్ష్యంతో.. ప్రజలకోసం ఏర్పడే అతిపెద్ద ఫెడరల్ ఫ్రంట్ తమదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రత్యామ్నాయ రాజకీయ పునరేకీకరణపై తాను బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో చర్చించి సమిష్టి నాయకత్వంతో ముందుకు కదులాలని ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. ఫ్రంట్ ఏర్పాటుపై నిదానంగా అడుగులు వేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు దేశ రాజకీయాలకు శుభ పరిణామమని మమతాబెనర్జీ వ్యాఖ్యానించారు. ఇకపై తాము కలిసి కదులుతామని ఇతర పార్టీలను కూడా ఈ వేదికపైకి తెస్తామని వెల్లడించారు.
అయితే ఈ ప్రకటన నుంచి ఒక్కరోజులోనే తమ స్టాండ్ మార్చుకున్నారు మమత. మమత ఈనెల 26 నుంచి నాలుగు రోజులపాటు ఢిల్లీలో పర్యటిస్తారని - పవార్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా హాజరవుతారని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు మంగళవారం తెలిపాయి. ఈ సందర్భంగా ఆమె యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ - కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు అవకాశాలున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఓ వైపు ఫ్రంట్ పేరుతో కేసీఆర్ ఉద్యుక్తుడు అవుతుండగా మరోవైపు కాంగ్రెస్ కు మమత చేరువ అవడం ఆసక్తికరంగా మారింది.