Begin typing your search above and press return to search.

సొంత ఇలాకాలో దీదీకి షాకిచ్చిన మోదీ!

By:  Tupaki Desk   |   25 May 2018 12:24 PM GMT
సొంత ఇలాకాలో దీదీకి షాకిచ్చిన మోదీ!
X
ప్ర‌ధాని మోదీపై, బీజేపీపై ప‌శ్చిమ బెంగాల్ సీఎం, తృణ‌ముల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సంద‌ర్భానుసారంగా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న్ సంగ‌తి తెలిసిందే. పెద్ద నోట్ల ర‌ద్దు - జీఎస్టీ స‌మ‌యంలో మోదీపై మ‌మ‌త విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. మోదీకి వ్య‌తిరేకంగా రాబోయే ఎన్నిక‌ల్లో తృతీయ కూట‌మి ఏర్పాటు కావాల‌ని బ‌లంగా కాంక్షించే ప్రాంతీయ‌పార్టీ అధినేత‌ల్లో మ‌మ‌త ముందుంటారు. మోదీకీ - దీదీకి మ‌ధ్య కోల్డ్ వార్ జ‌రుగుతూ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో దీదీకి మోదీ షాకిచ్చారు. ప‌శ్చిమ‌బెంగాల్ లోని శాంతినికేతన్ లో ఉన్న విశ్వభారతి యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా అందించే దేశికొత్తమ్‌ అవార్డుల ప్రదానోత్సవంలో మోదీ పాల్గొన‌కుండా వెళ్లిపోవ‌డంతో మ‌మ‌త అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. వ‌ర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌కుండానే వెళ్ల‌డంతో దీదీ అసంతృప్తి చెందారు. మోదీ పాల్గొన‌క‌పోవ‌డంతో అవార్డుల వేడుక కార్య‌క్ర‌మాన్ని వ‌ర్సిటీ అధికారులు ర‌ద్దుచేశారు.

అయితే, ప్రధాని బిజీ షెడ్యూల్ వ‌ల్లే ఆయ‌న వెళ్లిపోయార‌ని బెంగాల్‌ ప్రభుత్వానికి పీఎంవో తెలియజేసింది. ఆ వివ‌ర‌ణ‌పై దీదీ అసంబద్ధంగా ఉందని దీదీ మండిప‌డ్డారు. ఐదేళ్లుగా వాయిదా ప‌డుతోన్న ఈ కార్య‌క్ర‌మం ఈ సారి కూడా వాయిదా ప‌డ‌డంతో దీదీ అసంతృప్తితో ఉన్నారు. మ‌రోవైపు, ఈ వ‌ర్సిటీ స్నాతకోత్సవంలో అతిథులతో సీఎం వేదిక పంచుకోవటం ఇదే తొలిసారి కావ‌డం గమనార్హం. అవార్డుల జాబితాపై కూడా మ‌మ‌త మండిప‌డ్డారు. జాబితాలో అమితాబ్‌ బచ్చన్‌ - రచయిత అమితవ్‌ ఘోష్‌ - ప్రముఖ కవి గుల్జర్‌ - పెయింటర్‌ జోగెన్‌ చౌదరి - ద్విజెన్‌ ముఖర్జీ తదితరుల పేర్లు ఉన్నాయి. అయితే ద్విజెన్ పేరును అవార్డుకు ఎంపిక చేయక‌పోవ‌డం ఏమిటని దీదీ ప్ర‌శ్నించారు. ఆ నిర్న‌యం త‌న‌ను దిగ్భ్రాంతికి గురి చేసింద‌ని మీడియాతో అన్నారు.

అంతకు ముందు ప్రధాని మోదీ, దీదీ ల‌మ‌ధ్య ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న జ‌రిగింది. మోదీ హెలీప్యాడ్ వ‌ద్ద‌కు వెళ్లిన దీదీ స్వ​యంగా పుష్ప‌గుచ్ఛం ఇచ్చి మోదీని వెంటబెట్టుకొచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కుమారస్వామి ప్రమాణ స్వీకారం సంద‌ర్భంగా కర్ణాటక డీజీపీపై దీదీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఆ డీజీపీని బదిలీ చేశారు. తాజాగా మోదీకి స్వాగ‌తం ప‌లికేందుకు హెలిప్యాడ్ వ‌ద్ద‌కు వెళ్లిన మ‌మ‌త‌....కొద్దిదూరం న‌డ‌వాల్సి వ‌చ్చింది. మమతను ఇటువైపుగా రావాల‌ని మోదీ సైగ చేయటంతో ఆమె న‌డుచుకుంటూ వ‌చ్చి మోదీకి పుష్ఫగుచ్ఛం అందించారు. పుష్ప‌గుచ్ఛం అందించిన త‌ర్వాత మోదీకి దీదీ ప్ర‌ణామం చేశారు. ఆ త‌ర్వాత‌...దీదీ...ఇటువైపు వెళ‌దాం అని పిలుస్తుంటే....మోదీ మొహం తిప్పుకొని అటువైపు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అంత దూరం త‌న‌ను నడిపించిన మోదీపై దీదీ ఎవరికి ఫిర్యాదు చేస్తుందోన‌ని నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.