Begin typing your search above and press return to search.
నితీశ్ ను గెలిపించినోడి నెక్ట్స్ షాకింగ్ టార్గెట్
By: Tupaki Desk | 11 Nov 2015 5:52 AM GMTలోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోడీ - బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నేత - మహాకూటమీ నాయకుడు నితీశ్ కుమార్ ల ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న హైటెక్ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తున్నప్పటికీ...ఆ హవాను అడ్డుకొని నితీశ్ ను గెలుపు తీరాలకు చేర్చారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్ తర్వాతి టార్గెట్ ఎవరు? ఎవరి గెలుపుకోసం ఆయన ప్రచార పర్వాన్ని నిర్వహించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం ఆయనను సంప్రదించినట్లు తెలిసింది. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశాంత్ కిశోర్ వ్యూహంపై ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఇటీవల నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసులను మోడీ కలవడం, బెంగాల్ లో కూడా దీదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఈ కొత్త వార్తలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
అయితే మమతాబెనర్జీ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చారు. ఇప్పటివరకు తాను ప్రశాంత్ కిశోర్ ను సంప్రదించలేదని ఆమె ఖండించారు. పలు దఫాలుగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాగలమని విశ్వాసంతో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ప్రశాంత్ కిశోర్ ను ప్రచారవ్యూహకర్తగా డిసైడ్ చేసేందుకు తృణమూల్ తరఫున ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి బహిరంగంగా వెలుగులోకి రావడంతో ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు సమాచారం